Bigg Boss Voting: ఈ వారం డేంజర్ జోన్‌లో రోహిణి - ఓటింగ్‌లో టాప్ వీళ్లే - నిఖిల్‌ను ఓడించిన ప్రేరణ!
Bigg Boss Voting: బిగ్‌బాస్‌లో ఈ వారం ఓటింగ్‌లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...గౌతమ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ వీక్ రోహిణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Voting: బిగ్‌బాస్ 8 తెలుగులో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు? టాప్ ఫైవ్‌లో ఎవరు ఉండనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్నవారి ఓటింగ్‌పై క్లారిటీ వచ్చింది. మరోసారి ఓటింగ్‌లో నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేశాడు.
గొడవ ప్లస్...
సోమవారం నాటి ఎపిసోడ్‌లో గౌతమ్‌తో జరిగిన గొడవ నిఖిల్‌కు చాలా ప్లస్సయ్యింది. యష్మిని వాడుకున్నావ్ అంటూ నిఖిల్‌పై గౌతమ్ నిరాధారమైన ఆరోపణలు చేశాడు. గౌతమ్ ఆరోపణలపై నిఖిల్ గట్టిగానే ఫైట్ చేశాడు. అతడు మాట్లాడిన పాయింట్స్ జెన్యూన్‌గా ఉండటంతో నిఖిల్ ఓటింగ్ భారీగా పెరిగింది. టాస్కుల్లో గెలవడం కూడా ప్లస్సయ్యింది.
నబీల్ మూడో ప్లేస్...
నిఖిల్ మరోసారి గౌతమ్ గట్టిపోటీ ఇచ్చాడు. సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఓటింగ్‌లో ఇద్దరి మధ్య చాలా తక్కువ తేడా ఉన్నట్లు సమాచారం. మూడో స్థానంలో నబీల్ కొనసాగుతోన్నాడు. ఇక ఓటింగ్‌లో నాలుగో స్థానంలో ప్రేరణ నిలిచింది. మంగళవారం టాస్కులో నిఖిల్‌ను ఓడించడం ప్రేరణకు ప్లస్సయ్యింది. ఐదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నది.
డేంజర్ జోన్‌లో రోహిణి...
ఈ వారం డేంజర్ జోన్‌లో రోహిణి ఉంది. ఈ వీక్ ఆమె ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో రోహిణికే తక్కువ ఓట్లు వచ్చాయి.
బిగ్‌బాస్ ఓట్ అప్పిల్...
బిగ్‌బాస్ మంగళవారం ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌కు ఓట్ అప్పిల్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. సీజన్ 8 విన్నర్‌గా నిలిచేందుకు ఉన్న అర్హతలేమిటో నేరుగా అభిమానులకు చెప్పి వారిని ఓట్లు వేయమని అడిగే అవకాశం ఓ కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇందుకోసం కొన్ని టాస్కులు పెట్టాడు. ఈ టాస్కుల్లో హౌజ్‌మేట్స్ జంటలుగా ఆడాలని అన్నాడు. మీ జంటను మీరే ఎంచుకొండి అని చెప్పాడు. నాతో ఆడాలనుకుంటున్న పర్సన్స్ నా దగ్గరకు వచ్చి నాతో ఎందుకు ఆడాలని అనుకుంటున్నారో చెప్పాలంటూ గౌతమ్ బిల్డప్‌లు ఇవ్వబోయాడు. కానీ రోహిణి అతడి గాలితీసేసింది.
నిఖిల్...ప్రేరణ
ఈ టాస్క్‌లో ప్రేరణ -నిఖిల్, విష్ణుప్రియ -. రోహిణి జంటలుగా దిగారు. తొలుత నబీల్...అవినాష్‌తో జంటగా ఆడాలని అనుకున్నాడు. దాంతో గౌతమ్ ఒంటరిగా మిగిలిపోవడంతో టాస్క్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అవినాష్ నామినేషన్స్‌లో లేకపోవడంతో గౌతమ్‌కు టాస్క్‌లో పాల్గొనడం అవసరం కావడంతో నబీల్ తన నిర్ణయం మార్చుకున్నాడు. గౌతమ్‌తో జోడీ కట్టాడు.
గౌతమ్ - నబీల్ ఔట్...
తొలి టాస్క్‌లో నా టవర్ ఎత్తైనదిలో నిఖిల్, ప్రేరణ గెలిచారు. ఈ టాస్క్‌లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ - నబీల్ తదుపరి టాస్క్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయారు.
నిఖిల్‌ను ఓడించిన ప్రేరణ...
ఆ తర్వాత టక్ టకాటక్ అనే టాస్క్‌లో నిఖిల్, ప్రేరణతో పాటు రోహిణి మాత్రమే పాల్గొన్నారు. రోహిణి కోసం విష్ణుప్రియ తన ప్లేస్‌ను త్యాగం చేసింది. ఈ టాస్క్‌లో నిఖిల్, రోహిణిలను ఓడించి ప్రేరణ ఓట్ అప్పీల్ ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్ హిస్టరీలో ఫస్ట్ ఫిమేల్ విన్నర్‌గా నిలవాలని ఉందని, మీరు ఓట్లు వేసి సపోర్ట్ చేసే ఆ కలను నెరవేర్చుకుంటానని అభిమానులను రిక్వెస్ట్ చేసింది.