Pushpa 2 Release : పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత-telangana high court green signal pushpa 2 released cancelled petition to stop release ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pushpa 2 Release : పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత

Pushpa 2 Release : పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2024 10:59 PM IST

Pushpa 2 Release : పుష్ప2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్ప 2 విడుదల నిలివేయాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు సమయం వృథా చేశారని పిటిషన్ కు జరిమానా విధించింది.

పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత
పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. పుష్ప 2 నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీశారని, విడుదల ఆపాలని శ్రీశైలం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూశాకే విడుదలకు అనుమతి ఇచ్చారని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఊహాజనితంగా నిర్మించిన సినిమాను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లతో తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు కోర్టు సీరియస్ అయ్యింది. పిటిషనర్ కు జరిమానా విధించిన కోర్టు... దానిని ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని ఆదేశించింది.

పుష్ప2 మూవీపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా అంతా అవాస్తవమేనని, రూ.10 లక్షలున్న ఎర్ర చందనాన్ని, రూ.కోటి లాగా చూపించారన్నారు. దీంతో స్మగ్లింగ్ పెరిగిందని, లక్షలాది చెట్లు నరికేశారని ఆరోపించారు. ఇప్పుడు పుష్ప2తో ఇంకెన్ని చెట్లు నరికిస్తారో? అని ప్రశ్నించారు. యువతను తప్పుదోవ పట్టించేలా సినిమాలు తీస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ ను అరెస్టు చేసి జైల్ లో వేయాలన్నారు. ఈ సినిమాను విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.

పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై పిటిషన్

పుష్ప2 సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్లు భారీగా పెంచారని తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై మంగళవారం విచారణ జరిగింది. బెనిఫిట్ షోల పేరుతో ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మొదటి 15 రోజులు టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవారి తెలిపారు. ప్రభుత్వమే టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చిందన్నారు.

భారీగా టికెట్ రేట్ల పెంపుపై అభిమానులపై భారం పడుతోందని, బెనిఫిట్ షోలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినింపించారు. బెనిఫిట్‌ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ. 8 వేలు అవుతుంది కదా అని జడ్జి అడిగారు. అయితే బెనిఫిట్‌ షోలు కేవలం హీరో ఫ్యాన్స్ కు మాత్రమేనని, అందుకే రేట్లు ఎక్కువగా పెంచినట్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి వాయిదా వేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం