Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?-singham again ott release date announced streaming on amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Movie On Ott: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

Galeti Rajendra HT Telugu
Dec 03, 2024 09:40 PM IST

Singham Again OTT Release Date: గోల్ మాల్, సింగం సినిమాలతో మంచి కమర్షియల్‌ హిట్స్ అందుకున్న డైరెక్టర్ రోహిత్ శర్మ.. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్స్‌తో సింగం ఎగైన్ సినిమా తీశాడు. ఈ మూవీ.. ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోందంటే?

ఓటీటీలోకి సింగం ఎగైన్
ఓటీటీలోకి సింగం ఎగైన్

ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ మూవీ ‘సింగం ఎగైన్’ వచ్చేస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం‌లో అజయ్ దేవగణ్,దీపికా పదుకోణె, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ తదితరులు నటించిన ఈ సినిమా నవంబరు 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. నెలన్నర రోజుల వ్యవధిలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోతోంది.

సింగం ఎగైన్ కథ ఏంటంటే?

పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్).. ఓ కేసులో ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్)ను అరెస్ట్ చేస్తాడు. దాన్ని మనసులో పెట్టుకుని బాజీరావ్ సింగం భార్య అవని (కరీనా కపూర్ ఖాన్)ను ఒమర్ మనవడు కిడ్నాప్ చేస్తాడు. అంతకముందే అతను శక్తి శెట్టి (దీపికా పదుకోన్) ఉండే పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టేస్తాడు. దాంతో.. బాజీరావ్ సింగం తన భార్యని రక్షించుకోవడానికి సింబ (రణవీర్ సింగ్), సత్య (టైగర్ ష్రాఫ్), సూర్యవంశీ (అక్షయ్ కుమార్) ఎలా సాయం పడ్డారు..? చివరికి బాజీరావ్ అనుకున్నది సాధిస్తాడా? అనేది సినిమా.

రూ.240 కోట్లు వసూళ్లు

సింగం ఎగైన్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. ‘భూల్‌ భులయ్యా 3 నుంచి హిందీ మార్కెట్‌లో గట్టి పోటీఎదురైనా నిలబడగలిగింది. అయితే.. యాక్షన్ సినిమాలో అంతర్లీనంగా రామాయణం కథని జొప్పించబోయిన రోహిత్ శెట్టి.. ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో మాత్రం మెప్పించలేకపోయారు. అయినప్పటికీ.. స్టార్ కాస్ట్ కారణంగా మూవీ కొన్ని రోజుల పాటు థియేటర్లలో సందడి చేయగలిగింది.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

సింగం ఎగైన్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాని డిసెంబరు 17న అమెజాన్ స్ట్రీమింగ్‌కి ఉంచనుంది. అయితే.. రెంట్ బేసిస్‌ చూడాలంటే డిసెంబరు 17 నుంచే ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చు. యాక్షన్ సినిమాలంటే ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.

Whats_app_banner