Chaitanya Sobhita Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి హాజరయ్యే అతిథుల జాబితా లీక్.. లిస్ట్‌లో టాప్ సెలెబ్రిటీలు
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: మూడేళ్లు డేటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఎవరెవరు రాబోతున్నారంటే?
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం (డిసెంబరు 4)న ఈ వివాహ జరగనుండగా.. పరిమిత సంఖ్యలో మాత్రమే బంధువులు, సన్నిహితుల్ని ఇరు కుటుంబాలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతో శోభిత ధూళిపాళ్ల అప్‌డేట్స్ ఇస్తోంది.
ఏఎన్నాఆర్ ఆశీర్వాదంతో
అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ వివాహ వేదికని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబంతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరుకానున్నారు. అలానే ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ ఈ పెళ్లికి రావడంపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెళ్లికి హాజరయ్యే లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఈ సెలెబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
రెండేళ్లు డేటింగ్
రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే.. డేటింగ్‌లో ఉన్నప్పుడే ఒకటి- రెండు సార్లు కెమెరాలకి ఈ జంట చిక్కినా.. తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసింది. కానీ.. సడన్‌గా నిశ్చితార్థం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిశ్చితార్థం తర్వాత నాగచైతన్య, శోభిత పలు పంక్షన్లలో జంటగా కనిపించారు.
సమంతతో పెళ్లి.. విడాకులు
2017లో సమంత, నాగచైతన్య వివాహం చేసుకోగా.. మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటూ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. మరోవైపు నాగచైతన్య నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరిలో విడుదలకానుంది. ఆ మూవీలో నాగచైతన్యకి జోడీగా.. సాయి పల్లవి నటించింది.