AP Irrigation Election : తుపాను ఎఫెక్ట్, ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికల వాయిదా-ap irrigation association election postponed due to heavy rains govt released orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Irrigation Election : తుపాను ఎఫెక్ట్, ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికల వాయిదా

AP Irrigation Election : తుపాను ఎఫెక్ట్, ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికల వాయిదా

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2024 06:00 PM IST

AP Irrigation Election : ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 5న జరగాల్సిన సాగునీట ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సమాచారం అందించింది.

తుపాను ఎఫెక్ట్, ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికల వాయిదా
తుపాను ఎఫెక్ట్, ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికల వాయిదా

ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. తుపాను, భారీ వర్షాల కారణంగా ఎన్నికలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్లకు సమాచారం అందించింది. ఎన్నికలపై తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ఏపీలోని సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 6,149 సాగునీటి సంఘాలు , 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఓటరు జాబితాల రూపకల్పన, ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలోని భారీ, మధ్య, చిన్న నీటి పారుదల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. చివరిగా 2015లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఓటర్ల సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన తర్వాత 2015లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ సాగునీటి సంఘాలను పట్టించుకోలేదు. 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, 6,149 సాగునీటి వినియోగదారుల కమిటీల పరిధిలో డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇటీవల వర్షాలకు ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మూడు దశల్లో ఎన్నికలు

సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి విడతలో నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆరుగురు డైరెక్టర్లు ఓ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రెండో దశలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకోనున్నారు. మూడో దశలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు జిల్లా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ కమిటీలు డ్రైయినేజీ వ్యవస్థ, పూడికతీత, మట్టి తొలగింపు, పంట కాల్వల ఆధునీకరణ పనులు చేపడతారు.

Whats_app_banner

సంబంధిత కథనం