SVBC Chairman : ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు-ttd svbc chairman other posts murali mohan aswinidutt rajendera prasad names in discussion ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Svbc Chairman : ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు

SVBC Chairman : ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు

HT Telugu Desk HT Telugu
Dec 03, 2024 04:47 PM IST

SVBC Chairman Post : టీటీడీ పెండింగ్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎస్వీబీసీ ఛైర్మన్ సహా పలు టీటీడీ పోస్టులకు సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు
ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి భర్తీపై కసరత్తు- పరిశీలనలో మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)లో పెండింగ్ పదవుల భర్తీపై కసరత్తు జరుగుతోంది. సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నందమూరి బాలయ్య ద్వారా మరికొందరు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

టీటీడీ అనుబంధ విభాగాలుగా ఉన్న శ్రీ వెంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ (ఎస్‌వీబీసీ) ఛైర్మన్‌, శ్రీ వెంక‌టేశ్వ ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఎస్‌వీఈటీఏ) ఛైర్మన్ నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధప‌డుతోంది. ఈ రెండు విభాగాలూ టీటీడీలో కీల‌క‌మైన ప‌ద‌వులుగా ఉన్నాయి. వాటి కోసం ప‌లువురు ఆశావ‌హులు పావులు క‌దుపుతున్నారు. అలాగే ఎస్‌వీబీసీ ఛైర్మన్ ప‌ద‌వితో పాటు ఎస్‌వీబీసీ సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వుల భ‌ర్తీ కోసం కూడా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఈ ప‌ద‌వుల‌ను సొంతం చేసుకునేందుకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.

ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటించారు. టీటీడీ బోర్డును నియమించారు. టీటీడీలో ప్రతిష్ఠాత్మకమైన ఎస్‌వీబీసీ చైర్మన్ నియామకంపైన చర్చలు జరుగుతున్నాయి. సినీ ప్రముఖుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్, బాలయ్య సైతం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

రేసులో ప్రముఖులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత కీలక పదవుల ఖరారు పైన ఆసక్తి నెలకొంది. టీటీడీ బోర్డు పైన సుదీర్ఘ కసరత్తు తరువాత మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుకు అప్పగించారు. మూడు పార్టీలకు చెందిన వారికి టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు. టీటీడీకి అనుబంధ విభాగమైన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఎస్వీబీసీతో పాటుగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్‌ నియామకంపైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల నుంచి ఈ పోస్టుల కోసం లాబీయింగ్ మొదలైంది.

ఎస్‌వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి పైన కసరత్తు మొదలైంది. ఎస్‌వీబీసీ ఛాన‌ల్ ప్రారంభ‌మైన త‌రువాత 2018 ఏప్రిల్ 21న‌ సినీ ద‌ర్శకుడు రాఘ‌వేంద్రరావును అప్పటి టీడీపి ప్రభుత్వం ఛైర్మన్‌గా నియ‌మించింది. 2019లో జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ప్రభుత్వం రావ‌డంతో రాఘ‌వేంద్రరావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం సినీన‌టుడు పృథ్వీకి ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. అయితే ఆయ‌న వివిధ వివాదాల నేప‌థ్యంలో రాజీనామా చేశారు. ఆ త‌రువాత వెంక‌ట‌గిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర ఎస్‌వీబీసీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు.

దాదాపు మూడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగిన ఆయ‌న 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మార‌డంతో రాజీనామా చేశారు. దీంతో అప్ప‌టి నుంచి ఆ ప‌ద‌వి ఖాళీగా ఉంది. దీంతో పాటు సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వులు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఎస్‌వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వుల కోసం ప‌లువురు ఆస‌క్తి చూసుతున్నారు. త్వ‌ర‌లో ఈ నియామ‌కాలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంక‌టేశ్వ ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఎస్‌వీఈటీఏ) చైర్మ‌న్ కోసం ప‌లువురు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల‌కు, అర్చ‌కుల‌కు ఎస్‌వీఈటీఏ కేంద్రంగానే శిక్ష‌ణ ఇస్తుంటారు. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సోద‌రుడు, రిటైర్డ్ లెక్చ‌ర‌ర్‌ భూమ‌న సుబ్ర‌హ్మ‌ణ్యం రెడ్డి ఈ ప‌ద‌విలో ఉన్నారు. అయితే ప్ర‌భుత్వం మార‌డంతో ఆయ‌న కూడా రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

ఎస్‌వీబీసీ చైర్మ‌న్ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్, నందమూరి బాలయ్య ద్వారా మరి కొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదన పైనా చర్చ జరుగుతోంది. దీంతో, పవన్, బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో ఇద్దరు సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సుదీర్ఘ కాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక ప్రముఖుడి పేరు బాలయ్య సూచించినట్లు సమాచారం. అదే విధంగా పవన్ అభిప్రాయం సైతం తీసుకున్న తరువాత డిసెంబర్ తొలి వారంలో ఎస్‌వీబీసీ చైర్మన్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ చైర్మన్‌ పదవి కోసం జనసేన తిరుపతి నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో సినీ రంగం నుంచి ఈ పదవి ఎవరు దక్కించు కుంటారనేది ఆసక్తి కరంగా మారింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం