చలికాలంలో ధనియాల నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 03, 2024
Hindustan Times Telugu
మనం నిత్యం వంటకాల్లో వాడే ధనియాల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ధనియాలు నానబెట్టిన నీటిని తాగితే చలికాలంలో మరింత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ నీటి వల్ల ఆరోగ్యానికి ఎలా లాభాలు ఉంటాయంటే..
Photo: Pexels
ధనియాల్లో డయెటరీ ఫైబర్ ఉంటుంది. దీంతో ధనియాలు నానబెట్టిన నీరు తాగితే జీర్ణం మెరుగ్గా అవుతుంది. చలికాలంలో సాధారణంగా జీర్ణ సమస్యలు వస్తుంటాయి. వారు ధనియాల నీరు తాగితే ఉపశమనం ఉంటుంది.
Photo: Pexels
ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు, కీలకమైన విటమిన్లు మెండుగా ఉంటాయి. దీంతో ధనియాల వాటర్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల రిస్క్ ఉండే చలికాలంలో.. అనారోగ్యం బారిన పడకుండా ధనియాల నీరు తోడ్పడుతుంది.
Photo: Freepik
ధనియాల నీరు.. శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేలా చేయగలదు. అందుకే మధుమేహం ఉన్న వారు ఈ నీరు తాగడం ప్రయోజనకరం.
Photo: Pexels
శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు ధనియాల నీరు సహకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
ధనియాలు నానబెట్టిన నీరు రెగ్యులర్‌గా తాగితే చర్మానికి కూడా మేలు. చర్మంలో పేరుకుపోయిన మలినాలు తొలగేలా ఇది తోడ్పడుతుంది. చర్మపు మెరుపును కూడా పెంచగలదు.
Photo: Pexels
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెళ్లను ధనియాలు తగ్గించగలవు. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అందుకే ధనియాలు నీరు నానబెట్టిన నీరు రెగ్యులర్‌గా తాగడం మంచిది.
Photo: Pexels
పిల్లలు ఫోన్‌ను ఎంత సేపు వాడాలి అనేది నిర్ణయించి, ఆ సమయాన్ని కఠినంగా పాటించాలి.