AP Cabinet Decisions : ఏపీ మారిటైమ్ పాలసీ ఆమోదం, కేబినెట్ కీలక నిర్ణయాలివే-ap cabinet key decisions pm awas yojana houses at tribal areas integrated tourism policy approved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : ఏపీ మారిటైమ్ పాలసీ ఆమోదం, కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఏపీ మారిటైమ్ పాలసీ ఆమోదం, కేబినెట్ కీలక నిర్ణయాలివే

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2024 10:32 PM IST

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లు రద్దు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లు రద్దు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ 2024-29కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ మారిటైమ్ పాలసీ ఆమోదం

ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఇన్ఫ్‌ర్మెషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2047 నాటికి ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త లక్ష్య సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్ వర్కింగ్ స్పేస్‌లు క్రియేట్ చేయాలని నిర్ణయించింది. వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్పేస్‌లు డెవలెప్ చేసే వారికి ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని రకాల వ్యాపారాలతోపాటు ఐటీ కంపెనీలు అవే భవనాల్లో ఉండాలనే కో-వర్కింగ్ స్పేస్ పనిచేస్తుందన్నారు.

వందమందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పార్థసారధి తెలిపారు. ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ రంగంలో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు రావాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. చేనేత కార్మికులకు, పద్మశాలీలకు ఈ పాలసీ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పీపీపీ మోడ్‌లో ఐదు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

పీఎంఏవై అర్బన్ , పీఎంఏవై గ్రామీణ్ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పర్యటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయన్నారు. అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం