AP Cabinet Decisions : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయగా… లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చించారు. పార్లమెంట్‌లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయించారు. దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈగల్((ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా)) పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు. మరోవైపు కొత్త క్రీడా పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం లభించింది.