Sabarimala Devotees : శబరిమల భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు, రైళ్లలో ఈ పదార్థాలు వెలిగించొద్దని విజ్ఞప్తి
Sabarimala Devotees : తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు. రైళ్లలో వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్ఫూరం వెలిగించవద్దని సూచించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, పూజా విధానంలో భాగంగా కర్పూరం, హారతి, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపింది. రైళ్లలో ఇలాంటి పనులు చేయవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. శబరిమల భక్తులకు కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. భక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.
రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని భక్తులను విజ్ఞప్తి చేస్తుంది. మండే స్వభావం ఉన్న పదార్థాలతో రైళ్లలో ప్రయాణం చేయడం, వాటిని వెలిగించడం నిషేధించినట్లు రైల్వే శాఖ తెలిపింది. మండే స్వభావం ఉన్న పదార్థాలు వెలిగిస్తే రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగి, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుందని తెలిపింది. రైల్వే ఆస్తులకు సైతం భారీగా నష్టం కలిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి వారిపై రైల్వే చట్టం-1989 ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు.
అయ్యప్ప స్వాములకు తప్పిన ప్రమాదం
విజయనగరం జిల్లా నుంచి శబరిమలకు వెళ్లిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం బస్సు ఆపారు. బస్సు ప్రక్కనే వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సుకు వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అయ్యప్ప భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఏపీ మీదుగా 62 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, కాచిగూడ, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లం, కొట్టాయంలకు భారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది.
1. రైలు నెం. 07133 : కాచిగూడ నుంచి కొట్టాయం - డిసెంబర్ 5, 12, 19 & 26 తేదీల్లో
2. రైలు నెం. 07134 : కొట్టాయం నుంచి కాచిగూడ - డిసెంబర్ 6, 13, 20 & 27 తేదీల్లో
3. రైలు నెం.07135 : హైదరాబాద్ నుంచి కొట్టాయం - డిసెంబర్ 3, 10, 17, 24 & 31 తేదీల్లో
4. రైలు నెం.07136 : కొట్టాయం - హైదరాబాద్ - డిసెంబర్ 4, 11, 18 & 25, జనవరి 1వ తేదీలో
శబరిమల ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-కొల్లాం, శ్రీకాకుళం రోడ్ - కొల్లాం మధ్య 44 శబరిమల ప్రత్యేక రైళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది.
1. 08539- విశాఖపట్నం నుంచి కొల్లాం - 04.12.2024 నుంచి 26.02.2025 వరకు ప్రతి బుధవారం
2. 08540-కొల్లాం నుంచి విశాఖపట్నం -05.12.2024 నుంచి 27.02.2025 వరకు ప్రతి గురువారం
3. 08553-శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం - 01.12.2024 నుంచి 26.01.2025 వరకు ప్రతి ఆదివారం
4. 08554-కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్డు - 02.12.2024 నుంచి 27.01.2025 వరకు ప్రతి సోమవారం
సంబంధిత కథనం