Swiggy Q2 Results: ఐపీఓ తరువాత తొలిసారి ఫైనాన్షియల్స్ ను ప్రకటించిన స్విగ్గీ; ఇన్వెస్టర్లకు పండుగే..-swiggy q2 results net loss narrows to rs 625 crore in first earnings post ipo ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swiggy Q2 Results: ఐపీఓ తరువాత తొలిసారి ఫైనాన్షియల్స్ ను ప్రకటించిన స్విగ్గీ; ఇన్వెస్టర్లకు పండుగే..

Swiggy Q2 Results: ఐపీఓ తరువాత తొలిసారి ఫైనాన్షియల్స్ ను ప్రకటించిన స్విగ్గీ; ఇన్వెస్టర్లకు పండుగే..

Sudarshan V HT Telugu
Dec 03, 2024 06:10 PM IST

Swiggy Q2 Results: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఈ క్యూ2 లో మంచి ఫలితాలను సాధించింది. ఐపీఓ తర్వాత స్విగ్గీ తొలిసారి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ2 లో స్విగ్గీ తన నికర నష్టాలను గణనీయంగా తగ్గించుకుంది. ఆదాయంలో 29 శాతం వృద్ధి సాధించింది.

స్విగ్గీ ఇన్వెస్టర్లకు పండుగే..
స్విగ్గీ ఇన్వెస్టర్లకు పండుగే.. (Photo: Courtesy Dr Choksey FinServ)

Swiggy Q2 Results: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో తన నికర నష్టాలను రూ.625.53 కోట్లకు తగ్గించుకుంది. తన ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ విభాగాల్లో బలమైన ఆర్డర్ వృద్ధిని సాధించింది. గత నెలలో ఐపీఓ (ipo) కు వచ్చిన తర్వాత తొలిసారిగా కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రకటించింది. రైట్స్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రూ.1,600 కోట్లకు మించని మొత్తాన్ని తమ అనుబంధ సంస్థ స్కూటీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో స్విగ్గీ ప్రకటించింది.

స్విగ్గీ ఆదాయం రూ.రూ.3,601.45 కోట్లు

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా స్విగ్గీ (swiggy) ఆదాయం రూ.2,763.33 కోట్ల నుంచి రూ.3,601.45 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో మొత్తం వ్యయాలు కూడా రూ.3,506.63 కోట్ల నుంచి రూ.4,309.54 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం సప్లై చైన్ సర్వీసెస్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో స్విగ్గీ అనుబంధ సంస్థ స్కూటీ నిమగ్నమై ఉంది. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.5,195.7 కోట్లుగా ఉంది. ఐపీఓతో నవంబర్ 13న ట్రేడింగ్ లోకి అడుగుపెట్టిన స్విగ్గీ సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలలకు 6.26 బిలియన్ రూపాయల (74 మిలియన్ డాలర్లు) కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. స్విగ్గీ, దాని ప్రధాన ప్రత్యర్థి జొమాటో తమ ప్రధాన ఫుడ్ డెలివరీ వ్యాపారాలతో పాటు క్విక్ కామర్స్ విభాగంలో కూడా పోటీ పడుతున్నాయి. క్విక్ కామర్స్ విభాగంలో స్విగ్గీ ఇన్ స్టామార్ట్, జొమాటో (zomato) కు చెందిన బ్లింకిట్, స్టార్టప్ సంస్థ జెప్టోతో పోటీ పడుతున్నాయి. ఈ విభాగంలోకి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ (reliance) కొత్తగా ప్రవేశించింది.

Whats_app_banner