Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు-jagtial kummaripalli brother killed another property issue on broad daylight ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

HT Telugu Desk HT Telugu
Dec 03, 2024 08:44 PM IST

Jagtial Crime : జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి వివాదంలో సొంత అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉన్న అన్న పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

ఆస్తి వివాదం హత్యకు దారి తీసింది. అన్న అని చూడకుండా తమ్ముడు దారుణంగా చంపేశాడు. కత్తితో కసితీర పొడిచి ప్రాణం తీశాడు. రక్తం పంచుకుని పుట్టిన అన్నను ఆస్తి గొడవతో హత్య చేసి పారిపోయాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన దారుణ హత్య కలకలం సృష్టిస్తుంది.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో బొమ్మల సుమన్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామంలోనే సొంత తమ్ముడు డిల్లేష్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కత్తితో కసి తీరా అన్నను పొడవంతో అక్కడికక్కడే అన్న సుమన్ ప్రాణాలు కోల్పోయాడు. సుమన్ డిల్లేష్ అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. ఆస్తి వివాదమే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి భర్తకు దూరంగా పుట్టింటి వద్దనే భార్య ఉండడంతో ఒంటరిగా ఉన్న అన్నపై తమ్ముడు పక్కా ప్లాన్ తో కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. కిరాణా షాప్ కోసం బయటికి వెళ్లిన అన్నపై తమ్ముడు దాడి చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బోరున విలపించిన భార్య కూతురు

తమ్ముడు చేతిలో హత్యకు గురైన అన్న సుమన్ కు భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ కలహాలతో సుమన్ భార్య, కూతురుతో కలిసి పుట్టింటి వద్దనే ఉంటుంది. సుమన్ హత్యకు గురయ్యాడనే సమాచారంతో తల్లి కూతురు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. గత కొంతకాలం డాడికి దూరంగా ఉంటున్న కూతురు, డాడీ డెడ్ బాడీని చూసి డాడీ..లే..డాడీ అంటూ తల, గుండెను బాదుకుంటూ విలపించిన తీరు చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.

పోలీసుల అదుపులో నిందితుడు

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరాతీశారు. ఆస్తి వివాదాలే హత్య కారణమని స్థానికులు తెలపడంతో హత్యకు పాల్పడింది తమ్ముడు ఒక్కడేనా?.. మరెవరి పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అన్నను కత్తితో పొడిచి హత్య చేసిన తమ్ముడు డిల్లేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం