Virat Kohli Injury: విరాట్ కోహ్లీకి ఏమైంది? ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియాలో కొత్త టెన్షన్-ind vs aus 2nd test injury scare for india as virat kohli trains with bandaged knee ahead of pink ball test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Injury: విరాట్ కోహ్లీకి ఏమైంది? ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియాలో కొత్త టెన్షన్

Virat Kohli Injury: విరాట్ కోహ్లీకి ఏమైంది? ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట టీమిండియాలో కొత్త టెన్షన్

Galeti Rajendra HT Telugu
Dec 03, 2024 10:07 PM IST

IND vs AUS 2nd Test: ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టు ముంగిట టీమిండియాలో కొత్త టెన్షన్ మొదలైంది. సెంచరీతో ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. మోకాలి వద్ద బ్యాండేజ్‌తో కనిపించాడు. మ్యాచ్‌కి ఇంకా 3 రోజులే సమయం ఉండగా…?

విరాట్ కోహ్లీకి గాయం
విరాట్ కోహ్లీకి గాయం

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట భారత్ జట్టులో కొత్త టెన్షన్ మొదలైంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కుడి కాలికి గాయంతో కనిపించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. నవంబరు చివర్లో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతుండగా ఇప్పుడు కోహ్లీ గాయం టెన్షన్ పెంచుతోంది.

సెంచరీతో ఫామ్‌లోకి కోహ్లీ

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగుల వద్దే ఔటైపోయిన విరాట్ కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు చేశాడు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేయగలిగింది. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆనందించేలోపు గాయం ఆ ఆనందంపై నీళ్లు చల్లింది.

ప్రాక్టీస్‌కి దూరంగా కోహ్లీ

భారత్ జట్టు ప్రస్తుతం అడిలైడ్‌లో ఉండగా.. టీమ్ ప్రాక్టీస్ సెషన్స్ వద్ద విరాట్ కోహ్లీ మోకాలి దగ్గర బ్యాండేజ్‌తో కనిపించాడు. దాంతో మిగిలిన ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా.. విరాట్ కోహ్లీ వారి ప్రాక్టీస్‌ను చూస్తూ అసౌకర్యంగా నడుస్తూ కనిపించాడు. దాంతో.. అడిలైడ్ టెస్టులో కోహ్లీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

టీమిండియా రిస్క్ చేస్తుందా?

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దాంతో.. ఒకవేళ అడిలైడ్ టెస్టులో ఆడిస్తూ కోహ్లీ గాయంతో రిస్క్ చేస్తే.. మిగిలిన మూడు టెస్టులకీ అతను దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా.. అడిలైడ్ టెస్టు నుంచి రెస్ట్ ఇస్తే.. మిగిలిన మూడు టెస్టులు అతను ఆడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో..టీమిండియా రిస్క్ చేస్తుందా? అనేది చూడాలి. విరాట్ కోహ్లీ గాయం తీవ్రతపై ఇప్పటి వరకూ బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Whats_app_banner