MS Dhoni Dance: రాంచీలో డ్యాన్స్ అదరగొట్టేసిన ధోనీ.. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి హుషారుగా స్టెప్‌లు
MS Dhoni Traditional Dance: గత ఐదేళ్లుగా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోని.. మిగిలిన సమయం పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. రాంచీలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం ధోనీ ఎంజాయ్ చేస్తున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఐదేళ్లుగా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్ 2025లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు.
ఉత్తరాఖండ్‌లో ధోనీ మూలాలు
ధోనీ రాంచీలో జన్మించినప్పటికీ అతని మూలాలు మాత్రం ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. ధోనీ పూర్వీకులు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందినవారు. దాంతో.. వారితో కలిసి 43 ఏళ్ల ధోని, అతని భార్య సాక్షి హుషారుగా డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపించింది.
'గులాబి షరారా' పాటకు తొలుత తన కుటంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసిన ధోనీ.. ఆ తర్వాత కూడా కొన్ని పాటలకి డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. కెప్టెన్ కూల్‌గా పేరొందిన ధోనీ.. మైదానంలో చాలా హుందాగా వ్యవహరిస్తుంటాడు. అలానే ప్రైవేట్ వేడుకల్లో కూడా పరిమితుల్ని దాటడు. అయితే.. తొలిసారి ధోనీలోని డ్యాన్సర్‌ని చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రూ.4 కోట్లతో ధోనీని రిటేన్
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన ధోనీ.. 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఐపీఎల్ 2025 వేలానికి ముందు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ.4 కోట్లతో రిటేన్ చేసుకుంది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై జట్టుని కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ నడిపించనున్నాడు.