Gokarna: గోకర్ణ టూర్ వెళితే తప్పక చూడాల్సిన ప్లేస్‍లు ఇవి.. మిస్ అవొద్దు!
Gokarna: గోకర్ణ పరిసర ప్రాంతాల్లో చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి. అట్రాక్టివ్ ప్లేస్‍లు ఉన్నాయి. గోకర్ణ టూర్‌కు వెళితే మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో ఇక్కడ తెలుసుకోండి.
కర్ణాటకలోని గోకర్ణ పర్యాటక ప్రాంతంగా బాగా పాపులర్ అవుతోంది. చాలా మంది వెకేషన్లకు గోకర్ణ వెళుతున్నారు. దీంతో ఫేమస్ డిస్టినేషన్ అయింది. బీచ్‍లు, పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు గోకర్ణ పరిసరాల్లో ఉన్నాయి. విభిన్న రకాల సీఫుడ్స్ కూడా ఇక్కడ పాపులర్. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే గోకర్ణ వెకేషన్‍కు వెళ్లేందుకు చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే, అక్కడికి వెళితే చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేస్‍లు మిస్ కాకుండా చూడాలి. అవేవో ఇక్కడ చూడండి.
యానా గుహలు
యానా గుహలు చాలా పురాతనమైనవి. ఇవి సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు. సున్నపు రాయితో అత్యంత భారీ రాతి కట్టడాలు ఉంటాయి. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి, పురాతన కట్టడాలు ఇష్టమైన వారికి యానా గుహలు బాగా నచ్చుతాయి. అడవి గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి ఈ గుహలను చూడాల్సి ఉంటుంది. వీటికి సమీపంలో ఉన్న సిర్సి పట్టణంలో నదీ తీరాన సహస్ర లింగం ఉంటుంది. గోకర్ణకు యానా గుహలు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
ఓం బీచ్
అరేబియన్ సముద్ర అందాలతో ఓం బీచ్ అద్భుతంగా ఉంటుంది. గోకర్ణ సమీపంలో ఇది ముఖ్యమైన అట్రాక్షన్. ఈ బీచ్ ప్రాంతం ఆహ్లాదకరంగా, ప్రకృతి అందాలతో ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
మహాబలేశ్వర ఆలయం
ఎంతో ప్రాముఖ్యత ఉన్న మహాబలేశ్వర ఆలయం.. గోకర్ణలో ఉంది. ద్రవిడుల శిల్పకళతో ఈ దేవాలయం దివ్యంగా ఉంటుంది. ఇక్కడికి భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కోటి తీర్థం కూడా చూడాలి.
గోకర్ణ బీచ్
గోకర్ణ బీచ్ చాలా ఫేమస్. ఈ సముద్ర తీరం అందంగా ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక కృతువులు ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడి స్థానిక సంప్రదాయలను ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకమైన చేపల వంటకాలు కూడా ఇక్కడ లభిస్తాయి.
జోగ్ వాటర్ ఫాల్స్
గోకర్ణకు జోగ్ వాటర్ ఫాల్స్ సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి వాటర్ ఫాల్స్, ప్రకృతి అందాల మనసును హత్తుకుంటాయి. అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే గోకర్ణ టూర్ వెళితే వీలైతే జోగ్ జలపాతం చూస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.
మీర్జాన్ కోట
ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఈ మీర్జాన్ కోట ఉంటుంది. పురాతన సాంస్కృతి వైభవాన్ని చాటుతుంది. పర్యాటకులు ఈ కోటపైకి ఎక్కవచ్చు. అంత ఎత్తు నుంచి చుట్టుపక్కల అందాలు చూడొచ్చు. గోకర్ణ నుంచి మీర్జాన్ కోట సుమారు 22 కిలోమీటర్లు ఉంటుంది.
మురుడేశ్వర్ ఆలయం, బీచ్
గోకర్ణ టూర్‌కు వెళితే మురుడేశ్వర్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించాలి. శివుడు కొలువైన ఈ ఆలయ రాజ గోపురం 209 అడుగుల ఎత్తుతో ఆశ్చర్యపరుస్తుంది. అద్భుత శిల్ప కళతో ఉండే ఈ గోపురం ఓ పురాతన అద్భుతం. ఇక్కడి బీచ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ ఆలయం సుమారు 80 కిలోమీటర్లు ఉంటుంది.
నైత్రానీ ఐల్యాండ్
గోకర్ణ నుంచి 60 కిలోమీటర్లు, మురుడేశ్వర్ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో నేత్రానీ ఐల్యాండ్ ఉంటుంది. ఆరేబియా సముద్రం మధ్యలో ఈ ఐల్యాండ్ ఉంటుంది. డైవింగ్ లాంటి వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ చేయవచ్చు. మంచి అనుభూతి ఉంటుంది.
మరిన్ని బీచ్‍లు
గోకర్ణ చుట్టు పక్కల మరిన్ని బీచ్‍లు కూడా ఉన్నాయి. హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ సహా మరికొన్ని ఆకట్టుకుంటాయి.