Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు-guntur special court orders to remove criminal case on dy cm pawan kalyan volunteer case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 19, 2024 03:11 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు ప్రత్యేక కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వాలంటీర్లపై వ్యాఖ్యలకు గానూ పవన్ నమోదైన క్రిమినల్ కేసును తొలగించింది. పవన్ కల్యాణ్ పై తాము ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పడంతో ఈ కేసును ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్, క్రిమినల్ కేసు ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కోర్టు. గతంలో పవన్ పై నమోదైన క్రిమినల్ కేసును తొలగించింది. పవన్ కల్యాణ్ పై అభియోగాలు తొలగిస్తూ గుంటూరు స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై 2023, జులై 29న వాలంటీర్ల పేరిట గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ కల్యాణ్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణలో భాగంగా తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు జడ్జి శరత్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోవడానికి వాలంటీర్లు ఒక కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. పలు జిల్లాల్లో వాలంటీర్ల ఫిర్యాదుల మేరకు పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టారు పోలీసులు.

పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పవన్‌పై ఏఐఎంఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారని అవమానించినందుకు.. పవన్‌ కల్యాణ్పై కేసు నమోదు చేయాలని ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని సమాధానం ఇచ్చారు. ఎన్టీయే కూటమి తరఫున పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి, ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడారి. వారి ఆశయాలకు దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి' అని పవన్ కల్యాణ్ కోరారు.

పవన్ కల్యాణ్ నాందేడ్‌ జిల్లా పాలజ్, దెగ్లూరులలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. లాతూర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. 'పదేళ్ల ఎన్డీయే పాలనలో ప్రపంచ పటంపై తిరంగ జెండా రెపరెపలాడుతోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. నాగ్‌పుర్‌ నుంచి ఠాణె వరకు నిర్మించిన సమృద్ధి మహా మార్గం నవనిర్మాణానికి బాటలు వేసింది' అని పవన్ వ్యాఖ్యానించారు.

'సమర్థ పాలన, స్థిరత్వం ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌ సూపర్‌స్టార్స్‌గా ఎదిగారు. అబ్దుల్‌ కలాంను గుండెల్లో పెట్టుకున్న దేశమిది. ఇలాంటివి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కనిపించవు. ఆర్టికల్‌ 370ని రద్దుచేసి దేశమంతా ఒకటేనని బీజేపీ నిరూపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసింది' అని పవన్ కల్యాణ్ వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం