చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com

By Maheshwaram Mahendra Chary
Dec 04, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. 

image source unsplash.com

చలికాలంలో నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

image source unsplash.com

చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను ఎదుర్కొవాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. నువ్వులు ఇందుకు బాగా సహకరిస్తాయి.

image source unsplash.com

 నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

image source unsplash.com

నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

image source unsplash.com

నువ్వులలో కాల్షియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అవి ఎముకలను బలోపేతం చేయడానికి బాగా సహాయపడతాయి. క్రమం తప్పకుండా తినడం వల్ల శారీరక అలసట, బలహీనత తగ్గుతాయి.

image source unsplash.com

చలికాలంలో నువ్వులు తింటే అందులో ఉండే విటమిన్ బి, విటమిన్ ఈ చర్మానికి పోషణను అందిస్తాయి. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి.

image source unsplash.com

చలికాలంలో ధనియాల నీరు  తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

Photo: Pexels