Stomach Pain remedies: పొట్ట నొప్పి వేధిస్తున్నప్పుడు ఈ ఆరు పనుల్లో ఏదో ఒకటి చేయండి, నొప్పి తగ్గుతుంది
Stomach Pain remedies: పొట్టనొప్పి ఎక్కువ మందిలో కలిగే సమస్య .పొట్టనొప్పి రాగానే ఏం చేయాలో తెలియక చాలామంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ పొట్టనొప్పిని తగ్గించే రెమిడీస్ ఉన్నాయి.
చలికాలంలో ఎక్కువమందికి పొట్టనొప్పి సమస్య వస్తుంది. దీనికి కారణం అతిగా ఆహారం తిడం లేదా తిన్నది అరగకపోయినా... అజీర్ణం వంటివి పొట్ట నొప్పికి కారణం అవుతాయి. కొందరిలో ఆకస్మికంగా ఇలా పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. పొట్ట నొప్పి వస్తే కాసేపైనా భరించడం కష్టమే. చలికాలంలో పొట్ట నొప్పితో బాధపడుతున్న వారు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ను పాటించవచ్చు. మీకు పొట్టనొప్పి మొదలవ్వగానే ఇక్కడ మేము చెప్పిన ఆరు చిట్కాలలో ఏదో ఒకటి పాటించండి. మీకు పొట్ట నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది.
అల్లం
ప్రతి ఇంట్లో అల్లం ఉండడం సహజం. అల్లం పొట్ట నొప్పిని తగ్గించే శక్తివంతమైన సహజ నివారిని. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటాయి. ఇవి వికారాన్ని, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. పొట్టలో అసౌకర్యాన్ని తగ్గించి, పొట్ట నొప్పి రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పొట్టనొప్పి రాగానే అల్లం టీ తాగడం లేదా అల్లం ముక్కలను నమలడం వంటివి చేయాలి. టీ అనగానే అందరూ పాలు కలిపిన టీలో అల్లం వేసుకోవడం అనుకుంటారు. అలా కాకుండా నీటిలో అల్లాన్ని మరిగించి ఆ నీటిని తాగాలి.
అరటి పండ్లు
అరటి పండ్లు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. వాంతులు కారణంగా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో ముందుంటుంది. అరటిపండు పొట్టలోని ఆమ్లాలను తటస్థం చేస్తుంది. కాబట్టి అజీర్ణం, పొట్టనొప్పి వస్తే వెంటనే అరటిపండును తినండి. ఇది చాలా వరకు నొప్పిని తగ్గిస్తుంది.
పుదీనా టీ
పుదీనా ఆకుల్లో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణశయం కండరాలను సడలిస్తుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరం, తిమ్మిరి, అజీర్ణ లక్షణాలు తగ్గేలా చేస్తుంది. పుదీనా టీ తాగడం వల్ల పొట్టనొప్పి చాలా వరకు తగ్గుతుంది. వాంతులు వచ్చే అవకాశం కూడా ఉండదు. పుదీనాను నీటిలో వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిని తాగాలి.
ఆపిల్
ఆపిల్ నేరుగా తినకుండా నీటిలో ఉడికించి పైన పొట్టు తీసి ఆ ఉడికిన ఆపిల్ ను తినండి. ఇది పెప్టిన్ అనే కరిగే ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది పొట్టలోని అదనపు ఆమ్లాలను గ్రహిస్తుంది. వికారాన్ని తగ్గించి జీర్ణ సౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల పొట్టనొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.
బోన్ సూప్
చికెన్ ముక్కలను నీటిలో వేసి పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వంటివన్నీ వేసి బాగా ఉడికించి ఆ నీటిని తాగాలి. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. పొట్ట నొప్పికి ఇది అద్భుతమైన ఔషధంగా మారుతుంది. అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
తెల్ల అన్నం
పొట్టనొప్పి వచ్చినప్పుడు సాధారణ తెల్లా అన్నాన్ని ఏమీ కలుపుకోకుండా కొంచెం కొంచెం తినేందుకు ప్రయత్నించండి. ఇది పొట్టనొప్పిని శాంత పరచడానికి ఉపయోగపడుతుంది. పొట్టలోని ఆమ్లాలను ఈ తెల్ల అన్నం గ్రహిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ చికాకు కలగకుండా ఉంటుంది. ఉడికించిన బంగాళదుంపలు కూడా పొట్ట నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
టాపిక్