Pudina Paneer curry: రోటీ చపాతీలకి జోడీగా పుదీనా పనీర్ కర్రీ వండుకుని చూడండి, రెసిపీ అదిరిపోతుంది-pudina paneer curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pudina Paneer Curry: రోటీ చపాతీలకి జోడీగా పుదీనా పనీర్ కర్రీ వండుకుని చూడండి, రెసిపీ అదిరిపోతుంది

Pudina Paneer curry: రోటీ చపాతీలకి జోడీగా పుదీనా పనీర్ కర్రీ వండుకుని చూడండి, రెసిపీ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Oct 08, 2024 05:30 PM IST

Pudina Paneer curry: రోటీ, చపాతీలు రాత్రిపూట తినేవారు పుదీనా పనీర్ కర్రీని వండుకుని చూడండి. ఎప్పుడూ పాలక్ పనీర్ బటర్ మసాలా మాత్రమే కాదు, రెసిపీ కూడా తెలుసుకోండి.

పుదీనా పనీర్ కర్రీ రెసిపీ
పుదీనా పనీర్ కర్రీ రెసిపీ

పనీర్‌తో ఎన్నో వంటకాలు చేస్తారు. ముఖ్యంగా పాలక్ పనీర్ కర్రీ, పాలక్ బటర్ మసాలా కర్రీలు చాలా ఫేమస్. అవే కాదు పుదీనా పనీర్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రాత్రిపూట అన్నం తినే వారి సంఖ్య తగ్గిపోతుంది. చపాతీ రోటీలు తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. బరువు పెరుగుతామన్న భయంతోనే చపాతీ, రోటీలను తింటున్నారు. వీటికి జోడీగా ఒకసారి పుదీనా పనీర్ కర్రీ చేసుకొని చూడండి. రుచి అదిరిపోతుంది. దీని వాసనే మెదడుకు కొత్త రిఫ్రెష్ మెంట్‌ని ఇస్తుంది. పుదీనా పనీర్ కర్రీ చేయడం కూడా చాలా సులువు.

పుదీనా పనీర్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ ముక్కలు - 200 గ్రాములు

పుదీనా ఆకులు - ఒక కప్పు

నూనె - సరిపడినంత

ఉల్లిపాయ - ఒకటి

టమోటోలు - రెండు

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

నీళ్లు - సరిపడినన్ని

పుదీనా పనీర్ కర్రీ రెసిపీ

1. పుదీనా ఆకులను ఏరి శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగును వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

4. ఉల్లిపాయల రంగు మారాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలపాలి.

5. టమోటాలను మిక్సీలో వేసి ఫ్యూరీలా మార్చుకోవాలి.

6. వేగుతున్న ఉల్లిపాయల మిశ్రమంలో టమోటా ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇది దగ్గరగా ఇగురు లాగా అవుతున్నప్పుడు పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోవాలి.

8. పనీర్ ముక్కలను వేయించి ముందుగానే పక్కన పెట్టుకున్న మంచిదే.

9. వేయించకుండా పనీర్ ముక్కలను ఇందులో వేసినా మంచిదే.

10. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి కలుపుకోవాలి.

11. దీన్ని చిన్నమంట మీద ఉడికించాలి. పుదీనా ఆకులు, టమోటాలు, ఉల్లిపాయలు, కారం, పసుపు అన్ని బాగా మిక్స్ అవుతాయి.

12. ఆ సమయంలోనే గరం మసాలాను వేసి ఉడికించుకోవాలి.

13. అవసరమైతే చిన్న గ్లాస్ తో నీళ్లను పోసుకోవాలి.

14. ఈ మొత్తం మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు చిన్న మంట మీద ఉడికిస్తే అది ఇగురులాగా దగ్గరగా వస్తుంది.

15. అంతే పుదీనా పనీర్ కర్రీ రెడీ అయినట్టే. దీన్ని చపాతీ, రోటీతో తింటే రుచి అదిరిపోతుంది.

పనీర్ కి అభిమానులు ఎక్కువ. అలాగే పుదీనా నుంచి వచ్చే వాసన కూడా మెదడుకు ఎంతో సాంత్వనను అందిస్తుంది. కాబట్టి పుదీనా, పనీర్ ఈ రెండూ కలిపి ఉండే వంటకం చాలా టేస్టీగానూ ఆరోగ్యాన్ని అందిస్తుంది. పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం నిండుగా ఉంటాయి. కాబట్టి పుదీనాను ప్రతి ఒక్కరూ తినాలి. ముఖ్యంగా పుదీనా పనీర్ కర్రీ డయాబెటిక్ పేషెంట్లు తినడం వల్ల వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పుదీనాలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Whats_app_banner