Tomato Pudina Chutney: స్పైసీ టమాటో పుదీనా పచ్చడి రెసిపీ, ఇడ్లీ దోశలతో అదిరిపోతుంది-tomato mint chutney recipe in telugu know how to make spicy pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Pudina Chutney: స్పైసీ టమాటో పుదీనా పచ్చడి రెసిపీ, ఇడ్లీ దోశలతో అదిరిపోతుంది

Tomato Pudina Chutney: స్పైసీ టమాటో పుదీనా పచ్చడి రెసిపీ, ఇడ్లీ దోశలతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 11:30 AM IST

Tomato Mint Chutney: స్పైసీ చట్నీలు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. ఇక్కడ మేము టమోటోలు, పుదీనా, కొబ్బరితో చేసిన స్పైసీ పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి.

టమోటా పుదీనా పచ్చడి రెసిపీ
టమోటా పుదీనా పచ్చడి రెసిపీ

టమోటా పచ్చడి పేరు చెబితేనే తినాలన్న కోరిక కలుగుతుంది. ఇక పుదీనా, కొబ్బరిని కూడా కలిపి స్పైసీగా చట్నీ చేస్తే దాని రుచి రెండింతలు ఎక్కువవుతుంది. ఇక్కడ మేము టమాటో పుదీనా చట్నీ రెసిపీ ఇచ్చాము. దీన్ని మీరు ఇడ్లీలోను, దోశల్లోనే కాదు అన్నంలో కూడా కలుపుకుని తినవచ్చు. ఈ టమోటో పుదీనా చట్నీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి. ఒక్కసారి చేసుకుంటే ఇది రెండు రోజులు తాజాగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తో పాటు లంచ్ లో కూడా దీన్ని తినవచ్చు.

టమోటా పుదీనా చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు

శనగపప్పు - మూడు స్పూన్లు

ఎండుమిర్చి - ఆరు

కొబ్బరి తురుము - మూడు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో

టమోటోలు - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

పుదీనా ఆకులు - అరకప్పు

నీళ్లు - సరిపడినన్ని

నూనె - తగినంత

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

మినప్పప్పు- ఒక స్పూను

స్పైసీ టమోటో పుదీనా చట్నీ రెసిపీ

1. టమోటాలను, పుదీనాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి శనగపప్పును వేయించుకోవాలి.

3. ఆ శనగపప్పు వేగాక కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకోవాలి.

4. నాలుగు ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి, టమోటోలు, పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

7. ఇప్పుడు మిక్సీలో వేయించుకున్న అన్నింటినీ వేసి చింతపండు తగినంత నీళ్లు వేసి రుబ్బుకోవాలి.

8. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

9. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయాలి.

10. ఆ నూనెలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

11. ఈ మిశ్రమాన్ని గిన్నెలోని పచ్చడిపై వేసుకోవాలి. అంతే స్పైసి టమోటో పుదీనా చట్నీ రెడీ అయినట్టే.

12. దీనిలో మనం కొబ్బరి తురుమును కూడా వేసాము.

13. కాబట్టి దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి మీకు ఎంతో నచ్చుతుంది.

ఈ చట్నీలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే అధికంగా వాడాము. టమోటోలు, పుదీనా, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్ని కూడా మనం శరీరానికి మేలు చేసేవే. సాధారణ పచ్చడితో పోలిస్తే కొబ్బరి తురుము, ఉల్లిపాయలు వేసిన ఈ పచ్చడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని ఇడ్లీతో తింటే అదిరిపోతుంది. అలాగే దోశతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. కొంచెం స్పైసీగా చేసుకుని అన్నంలో కలుపుకొని తింటే ఇది మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి ఈ పచ్చడి చేసుకొని చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner