Hing: ఇంగువను ఈ విధంగా వాడితే మీ కూరలకు రెట్టింపు రుచి రావడం ఖాయం-if you use asafoetida in this way your curries are sure to get double the taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hing: ఇంగువను ఈ విధంగా వాడితే మీ కూరలకు రెట్టింపు రుచి రావడం ఖాయం

Hing: ఇంగువను ఈ విధంగా వాడితే మీ కూరలకు రెట్టింపు రుచి రావడం ఖాయం

Haritha Chappa HT Telugu
Mar 26, 2024 10:30 AM IST

Hing: ఎంతోమంది ఇంగువను చాలా తక్కువగా చూస్తారు. దీనిని ఇళ్లల్లో వాడని వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇంగువను తగిన విధంగా వినియోగిస్తే కూరల రుచి పెరుగుతుంది. ఇంగువ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే.

ఇంగువ ప్రయోజనాలు
ఇంగువ ప్రయోజనాలు

Hing: ఇంగువ వాడకం ఈనాటిది కాదు. వందల ఏళ్ల నుంచి ఇంగువను ఆహారంలో భాగం చేసుకున్నారు. భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఇంగువదీ ప్రత్యేక స్థానం. అయితే ఇప్పుడు దీనిని వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. నిజానికి ఇంగువను సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్యానికే కాదు, రుచికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని కూరల్లో వాడడం వల్ల రెట్టింపు రుచి రావడం ఖాయం. ఇంగువను ఎలా వాడితే కూరలకు అధిక రుచి వస్తుందో తెలుసుకుందాం.

ఇంగువను ఎలా వాడాలి?

నూనె లేదా నెయ్యిలో ఇంగువను వేడి చేయడం వల్ల దాని రుచి, వాసన పెరుగుతాయి. అలా వేడి చేసిన ఇంగువను కూరల్లో కలపడం వల్ల రుచి రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా పప్పు వండినప్పుడు...తాలింపులో ఇంగువను కూడా నూనెలో వేసి లేదా నెయ్యిలో వేసి వేయించి అప్పుడు పప్పులో కలపండి. ఇది ఎక్కువ రుచిని అందించడంతోపాటు సువాసనను ఇస్తుంది. పోషకాల ఇంగువలోని పోషకాలు రెట్టింపు అవుతాయి.

ఇంగువను ఎప్పుడు పడితే అప్పుడు తాలింపులో వేసేయకూడదు. తాలింపు వేసేటప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకులు వంటివి వేస్తారు. ఇంగువను మొదటగా నూనెలో వేసి ఆ తర్వాతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వంటివి వేయాలి. ఇలా వేయడం వల్ల ఇంగువలోని రుచి, పోషకాలు నెయ్యి లేదా నూనెలోకి ఇంకిపోతాయి. ఇవి కూర లేదా పప్పులో వేసినప్పుడు అంతటా పంపిణీ అవుతాయి. అంతేకాదు ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి శరీరానికి ఇంగువ సాయం చేస్తుంది.

ఇంగువను పసుపు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వంటి ఇతర మసాలా దినుసులతో కలపడం వల్ల రుచి పెరుగుతుంది. కాబట్టి వీటిని మిక్సీలో వేసి రుబ్బడం వంటివి చేసినప్పుడు ఇంగువను కూడా కలిపి ఆ పని చేయండి. ఇది కూర కోసం రుచిని అందిస్తుంది.

ఇంగువకు రుచి అధికంగా ఉంటుంది. దీన్ని చిటికెడు వేసినా చాలు ఘుమఘుమలాడిపోతుంది. కాబట్టి ఇంగువను చాలా తక్కువ పరిమాణంలోనే వాడాలి. ఎక్కువగా వేస్తే అది చేదు రుచి వచ్చేస్తుంది.

ఇంగువను పప్పు కూరల్లో వాడడం వల్ల జీర్ణాశయానికి మేలు జరుగుతుంది. జీర్ణక్రియకు సహాయం చేయడంలో ఇంగువ ముందుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కూరల్లో ఇంగువను జోడించడం వల్ల జీర్ణ క్రియకు మేలు జరుగుతుంది. ఈ ఆహారాన్ని అయినా త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే పసుపు, అల్లం వంటి వాటితో జత చేస్తే శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది.

Whats_app_banner