Bigg Boss Time Change: సీరియల్ కోసం బిగ్‌బాస్ టైమింగ్స్ ఛేంజ్ - ఈ వీక్ ఎలిమినేట్ కానున్న ఇద్దరు కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss :బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టనున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌కు చేరువ అవుతోన్న టైమ్‌లో బిగ్‌బాస్ టెలికాస్ట్ టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. కొత్త టైమింగ్స్ ఏవంటే?
Bigg Boss Time Change: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఎండింగ్‌కు చేరుకుంది. మరో పన్నెండు రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే హౌజ్ నుంచి టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో అవినాష్ మినహా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
గౌతమ్ కృష్ణ, నిఖిల్ మలియక్కల్, నబీల్ అఫ్రీది, ప్రేరణ కంబం, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ రోహిణిలలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ వీక్ ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరిగింది. నబీల్, ప్రేరణ...ఇద్దరిలో ఒకరికి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చింది.
కానీ డబ్బులు పెట్టి ఫైనల్ చేరుకోవడానికి ఇద్దరు అంగీకరించలేదు. దాంతో వారు కూడా ఎలిమినేషన్స్‌లో నిలిచారు. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌లో టాప్ 5లో ఎవరుంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
టాప్ ఫైవ్....
ఈ వారం మిడ్‌వీక్‌లోనే ఓ కంటెస్టెంట్...వీకెండ్‌లో మరో హౌజ్‌మేట్ బిగ్‌బాస్ నుంచి బయట అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారం ప్రేరణ, రోహిణి ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ ఫైవ్‌లో నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, విష్ణుప్రియ ఉండనున్నట్లు సమాచారం.బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గౌతమ్ అతడికి గట్టి పోటీ ఇస్తోన్నాడు. అయితే సోమవారం నాటి ఎపిసోడ్‌లో నిఖిల్‌పై గౌతమ్ నోరుజారడం మైనస్‌గా మారింది. ఈ వీక్ గౌతమ్ ఓటింగ్ తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
టైమ్ ఛేంజ్...
ఫైనల్ చేరువ అవుతోన్న టైమ్‌లో బిగ్‌బాస్ షో టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇదివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు తొమ్మిదిన్నర గంటల నుంచి పదిన్నర వరకు బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు టెలికాస్ట్ అవుతుందని ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారమే సోమవారం నాటి ఎపిసోడ్ ప్రసారమైంది.
సీరియల్ కోసమే...
గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ కోసమే బిగ్‌బాస్ షో టైమింగ్స్‌ను మేకర్స్ ఛేంజ్ చేశారు. గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ సోమవారం నుంచి ప్రారంభమైంది. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు స్టార్ మాలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. సీరియల్ కోసం టాప్ రేటింగ్ షో ప్రసార సమయాన్ని మార్చడంపై అభిమానుల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తోన్నాయి.
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే డేట్
బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15న ఉండనున్నట్లు సమాచారం. డిసెంబర్ 15 ఆదివారం నాడు రాత్రి 7 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం. గ్రాండ్ ఫినాలేకు ఓ స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం. అతడి చేతుల మీదుగానే విన్నర్ ట్రోఫీ అందుకునే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.