Bigg Boss 6 Telugu 88 Episode: ఏకాభిప్రాయానికి అంగీకరించని హౌజ్‌మేట్స్ - రేవంత్‌కు కీర్తి వార్నింగ్
Bigg Boss 6 Telugu 88 Episode: టికెట్ టూ ఫినాలే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కోసం బిగ్‌బాస్ వివిధ రకాల టాస్క్‌లు ఇచ్చాడు. జెండాల జగడం టాస్క్‌లో కీర్తితో రేవంత్ గొడవపడ్డాడు. టికెట్ టూ ఫినాలే నెక్స్ట్ రౌండ్‌కు చేరుకునే కంటెస్టెంట్స్ ను ఏకాభిప్రాయంతో ఎంపికచేయాలని బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాలపై హౌజ్‌మేట్స్ అసహనానికి లోనయ్యారు.
Bigg Boss 6 Telugu 88 Episode: స్నో వారియర్స్ ఛాలెంజ్‌లో ఓటమి పాలైన శ్రీసత్య, ఇనాయా, కీర్తికి టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో పాల్గొనేందుకు చివరి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం రంగు పడితే రివైవల్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. ఈ టాస్క్‌లో ఇనాయా, కీర్తి కలిసి సత్యను టార్గెట్ చేశారు.
దాంతో ఫస్ట్ రౌండ్‌లో శ్రీసత్య ఔట్ అయ్యింది. సెకండ్ రౌండ్‌లో కీర్తి ఇనాయా పోటాపోటీగా ఆడారు. ఇందులో ఇద్దరి టీషర్ట్‌లపై రంగు ఒకేలా ఉండటంతో విన్నర్ ఎవరో ప్రకటించడం రేవంత్‌కు ఛాలెంజింగ్‌గా మారింది. ఇందులో కీర్తిని విన్నర్‌గా రేవంత్ ప్రకటించాడు.
జెండాల జగడం
స్నో వారియర్స్ రెండో లెవల్‌కు శ్రీసత్య, ఇనాయా మినహా మిగిలిన కంటెస్టెంట్స్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తదుపరి రౌండ్‌కు చేరుకునేందుకు పోటీదారుల కోసం జెండాల జగడం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రేవంత్ అగ్రెసివ్‌గా ఆడాడు. ఇందులో రేవంత్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా ఆదిరెడ్డి సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. కీర్తి, రోహిత్ చివరి స్థానంలో నిలిచారు.
ఏకాభిప్రాయంపై కంటెస్టెంట్స్ సీరియస్...
ఆ తర్వాత టికెట్ టూ ఫినాలే ఛాలెంజ్‌లో తదుపరి రౌండ్‌కు ఆరుగురిలో నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే వెళతారని, వారు ఎవరన్నది హౌజ్‌మేట్స్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. స్కోరును పరిగణన లోకి తీసుకోవద్దని సూచించాడు.
ఏకాభిప్రాయం నిర్ణయంపై రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డితో పాటు కంటెస్టెంట్స్ అందరూ అసహనానికి లోనయ్యారు. టికెట్ టూ ఫినాలే తాను ఆడాలని అనుకుంటున్నట్లు, ఒకవేళ తనను తీసేస్తే ఎవరిని గెలవనివ్వను అంటూ శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. ఏకాభిప్రాయం కారణంగా తాను చాలా నష్టపోయానని , టికెట్ టూ ఫినాలే నుంచి వైదొలగనని రేవంత్ గట్టిగా చెప్పాడు.
రేవంత్‌కు కీర్తి వార్నింగ్...
కష్టపడి ఆడి ఓడితే అర్థం ఉంటుందని, కానీ ఏకాభిప్రాయంతో వైదొలిగడం ఇబ్బందిగా ఉంటుందని మిగిలిన కంటెస్టెంట్స్ పేర్కొన్నాడు. ఆ తర్వాత జెండాల జగడం టాస్క్‌లో చివరి ప్లేస్‌లో నిలిచిన కీర్తి, రోహిత్‌ను తొలిగిస్తే బాగుంటుందని రేవంత్ అన్నాడు. రేవంత్ మాటలపై కీర్తి ఫైర్ అయ్యింది. తనను వీక్ అని అనడం బాగాలేదని అన్నాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని రేవంత్‌కు కీర్తి వార్నింగ్ ఇచ్చింది.
ఇనాయాతో కీర్తి గొడవ...
ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టాస్క్ నుంచి తొలగిపోయే కంటెస్టెంట్స్ ఎవరన్నది సంచాలక్‌లు అయిన ఇనాయా, శ్రీసత్య కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. స్కోరు బోర్డ్ ప్రకారం టాప్ ఫోర్‌లో నిలిచిన రేవంత్, శ్రీహాన్,ఆదిరెడ్డి, ఫైమాలను తదుపరి రౌండ్‌కు నామినేట్ చేసినట్లు శ్రీసత్య, ఇనాయా పేర్కొన్నారు. వారి నిర్ణయం పట్ల రోహిత్ అంగీకరించాడు. కీర్తి మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఇనాయాతో గొడవ పడింది. ఇద్దరు చాలా సేపు వాదించుకున్నారు.
ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఫైమాలకు కప్ సాసర్ బ్యాలెన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఆదిరెడ్డి విన్నర్ అయ్యాడు. మొత్తంగా టికెట్ టూ ఫినాలే లిస్ట్‌లో ఆదిరెడ్డి టాప్ స్కోరర్‌గా నిలవగా రేవంత్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.