(1 / 6)
ఏపీ, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కరవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది.
(2 / 6)
ఏపీలో ఇవాళ(డిసెబంర్ 04, 2024) అల్లూరి సీతారామరాజు, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(5 / 6)
ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
(6 / 6)
ఇక హైదరాబాద్ లో చూస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయం దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం వివరించింది.
ఇతర గ్యాలరీలు