Bigg Boss Nominations: బిగ్‌బాస్‌లో గ్రూపిజం...క‌న్న‌డ బ్యాచ్‌పై గౌత‌మ్ ఫైర్ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న‌ది వీళ్లే!-bigg boss 8 telugu 11th week nominations gautham fires on mega chief prerana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nominations: బిగ్‌బాస్‌లో గ్రూపిజం...క‌న్న‌డ బ్యాచ్‌పై గౌత‌మ్ ఫైర్ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న‌ది వీళ్లే!

Bigg Boss Nominations: బిగ్‌బాస్‌లో గ్రూపిజం...క‌న్న‌డ బ్యాచ్‌పై గౌత‌మ్ ఫైర్ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న‌ది వీళ్లే!

Nelki Naresh Kumar HT Telugu
Nov 12, 2024 06:19 AM IST

Bigg Boss Nominations: బిగ్‌బాస్ 8 తెలుగు 11వ వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేష‌న్స్‌లో నిలిచారు. గౌత‌మ్‌, ఆవినాష్, విష్ణుప్రియ‌, య‌ష్మి, తేజ, పృథ్వీ నామినేష‌న్స్‌లో ఉన్నారు. నామినేష‌న్స్ టాస్క్ మొత్తం గొడ‌వ‌ల‌తో సాగింది.

బిగ్‌బాస్  నామినేష‌న్స్‌
బిగ్‌బాస్ నామినేష‌న్స్‌

Bigg Boss Nominations: ఈ వారం బిగ్‌బాస్ నామినేష‌న్స్ ప్ర‌క్రియ ముగిసింది. ఈ నామినేష‌న్స్ టాస్క్ మొత్తం గొడ‌వ‌ల‌తో సాగింది. ఈ వారం నామినేష‌న్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. గౌత‌మ్‌, ఆవినాష్, విష్ణుప్రియ‌, య‌ష్మి, తేజ, పృథ్వీ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఓ పెయింటింగ్‌ను క‌ల‌ర్‌తో పాడుచేస్తూ ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌ని అనుకుంటున్నారో వారి పేరు చెప్ప‌మ‌ని బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇచ్చాడు.

గౌతమ్ వర్సెస్ ప్రేరణ…

తొలుత మెగా చీఫ్ ప్రేర‌ణ... గౌత‌మ్‌ను నామినేట్ చేసింది. ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే గౌత‌మ్ గేమ్ ఆడుతున్నాడ‌ని, అత‌డిలో టీమ్ వ‌ర్క్ లేద‌ని ప్రేర‌ణ అన్న‌ది. ప్రేర‌ణ వాద‌న‌ల్ని త‌ప్పుప‌ట్టాడు గౌత‌మ్‌, బిగ్‌బాస్‌లో గ్రూపిజం, ఫేవ‌రేటిజం న‌డుస్తోంద‌ని గౌత‌మ్ అన్నాడు. య‌ష్మి కార‌ణంగా టాస్క్‌ల్లో ఓడిపోతే ఫ్రెండ్ కాబ‌ట్టి ఆమెను ఏమ‌న‌లేదు. ఫ్రెండ్‌లో త‌ప్పులు ఎన్ని ఉన్నా ఆమెను ఏమ‌న‌కుండా త‌న‌ను త‌ప్పుప‌డుతున్నావా అంటూ ప్రేర‌ణ‌పై ఫైర్ అయ్యాడు.

నిఖిల్ వ‌ర్సెస్ తేజ‌....

ఆ త‌ర్వాత నిఖిల్ వంతు రాగా... అత‌డు టేస్టీ తేజ‌ను నామినేట్ చేశాడు. ఎవిక్ష‌న్ షీల్డ్ పాస్ త‌న‌కు రాకుండా చేసినందుకు అత‌డిపై రివేంజ్ తీర్చుకున్నాడు. ఎవిక్ష‌న్ టాస్క్‌లో తేజ త‌ప్పు చేశాన‌నే త‌నే స్వ‌యంగా ఒప్పుకున్నాడ‌ని, అందుకే అత‌డిని నామినేట్ చేస్తున్న‌ట్లు చెప్పాడు. త‌న‌తో పాటు ఆ టాస్క్‌లో య‌ష్మి కూడా త‌ప్పు చేసింద‌ని నిఖిల్‌తో తేజ వాదించాడు.ఆ విష‌యం య‌ష్మినే అడుగు అంటూ నిఖిల్ మాట‌దాటేశాడు.

మ‌ధ్య‌లో పృథ్వీ…

మ‌ధ్య‌లో నిఖిల్‌...పృథ్వీ టాపిక్ తీసుకొచ్చాడు. స్మోకింగ్ జోన్‌లో స్మోక్ చేసినందుకు నిఖిల్‌ను నామినేట్ చేశావు క‌దా పాత గొడ‌వ‌ల్ని మ‌ళ్లీ గెలికాడు. పృథ్వీని నామినేట్ చేసినందుకు...ఇప్పుడు న‌న్ను నామినేట్ చేస్తున్నావా..క‌లిసే గేమ్ ఆడుతున్నారా అంటూ నిఖిల్‌ను నిల‌దీశాడు. మేము క‌లిసి ఆడుతున్నామ‌ని నీకు చెప్పామా అంటూ తేజ‌పై పృథ్వీ ఫైర్ అయ్యాడు.

య‌ష్మిని నామినేట్‌...

ఆ త‌ర్వాత తేజ వంతు రాగా...అత‌డు య‌ష్మిని నామినేట్ చేశాడు. ఎవిక్ష‌న్ టాస్క్‌లో య‌ష్మి, తాను ఇద్ద‌రం త‌ప్పు చేసినా త‌న‌నే బ‌లి చేశార‌ని అన్నాడు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని తేజ‌తో య‌ష్మి వాద‌న‌కు దిగింది. ఎవిక్ష‌న్ టాస్క్‌లో త‌న‌కు రెస్పెక్ట్ ఇవ్వ‌లేదు అంటూ తేజ‌తో గొడ‌వ‌ప‌డింది. మ‌ధ్య‌లో నిఖిల్ టాపిక్ తేజ తీసుకురావ‌డంతో య‌ష్మి స‌హ‌నం కోల్పోయింది. నాలోని త‌ప్పుల్ని చెప్ప‌డానికి నువ్వెమైనా బిగ్‌బాసా అంటూ గ‌ట్టిగా అరిచేసింది.

అవినాష్ నామినేట్‌...

ఆ త‌ర్వాత పృథ్వీ అవినాష్‌ను నామినేట్ చేశాడు. చీఫ్‌గా, సంచాల‌క్‌గా ఫెయిల‌య్యావ‌ని రీజ‌న్ చెప్పాడు.

రోహిణి...విష్ణుప్రియ‌ను నామినేట్ చేసింది. చీఫ్ కంటెండ‌ర్ అయ్యాకా...నాకు స‌పోర్ట్ చేస్తాన‌నిచెప్పి పృథ్వీకి స‌పోర్ట్ చేశావ‌ని రోహిణి అన‌గా...నాకు పృథ్వీనే ఎక్కువ అని విష్ణుప్రియ బ‌దులిచ్చింది.

Whats_app_banner