Bigg Boss Promo: టేస్టీ తేజకు పెళ్లి సంబంధాలు చూస్తున్న గంగవ్వ - రైజింగ్ స్టార్స్...ఫాలింగ్ స్టార్స్ ఎవరంటే?
Bigg Boss Promo: బిగ్‌బాస్ 8 తెలుగు దసరా ఎపిసోడ్ తాలూకు ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో టేస్టీ తేజకు గంగవ్వ పెళ్లి సంబంధాలు చూడటంపై నాగార్జున వేసిన పంచ్‌లు నవ్విస్తున్నాయి. నబీల్‌కు నాగార్జున క్లాస్ ఇచ్చాడు.

Bigg Boss Promo: బిగ్‌బాస్ 8 తెలుగు దసరా ఎపిసోడ్ తాలూకు ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో చూస్తుంటే పండుగ ఎపిసోడ్ సరదాగా, సీరియస్‌గా మిక్స్‌డ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాయల్స్, ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ టీమ్‌లను పలకరిస్తూ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నాగార్జున. వచ్చి రావడంతోనే మల్దీవ్స్ గురించి ఇమాజిన్ చేసుకొని అలిసిపోయావనుకున్నానని విష్ణుప్రియపై నాగార్జున సెటైర్స్ వేశాడు.మెహబూబ్ చేసిన ఫ్లర్టింగ్‌కు మాల్దీవ్స్ గురించి మొత్తం మర్చిపోయానని విష్ణుప్రియ బదులిచ్చింది. తనను కూడా మెహబూబ్ ఫ్లర్టింగ్ చేశాడంటూ హరితేజ కంప్లైంట్ ఇచ్చింది.
అరుంధతి డైలాగ్...
అరుధంతి నిన్ను వదలా అనే డైలాగ్‌తో మెహబూబ్, అవినాష్ చేత పర్ఫార్మెన్స్ చేయించాడు నాగార్జున. టేస్టీ తేజకు ఎందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావని గంగవ్వను అడిగాడు నాగార్జున. పొట్ట తగ్గిస్తే ఎవరన్న పోరి వస్తాది అని తక్కువ తినమని ఎంత చెప్పిన తేజ వినడం లేదని గంగవ్వ ఫన్నీగా నాగార్జునకు బదులిచ్చింది. ఆకలికి తేజ ఆగడం లేదని గంగవ్వ అన్నది. తేజ చేత పుషప్స్ చేయించమని మెహబూబ్‌కు టాస్క్ ఇచ్చాడు నాగార్జున.
కిరాక్ సీతకు ప్రశంసలు...
కిరాక్ సీతపై ప్రశంసలు కురిపించాడు. నీ మైండ్‌తో ఆటను మొత్తం టర్న్ చేశావని మెచ్చుకున్నాడు. రాయల్స్ టీమ్ వచ్చిన తర్వాత నీ ఆట మొత్తం మర్చిపోయావని నబీల్‌కు నాగార్జున క్లాస్ ఇచ్చాడు. నబీల్ ఆటతీరు తగ్గిపోయినట్లుగా నాగార్జున అతడిని గట్టిగానే మందలించబోతున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.
రైజింగ్ స్టార్స్...ఫాలింగ్ స్టార్స్...
రైజింగ్ స్టార్స్, ఫాలింగ్స్ స్టార్స్ కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా నాగార్జున విభజించబోతున్నట్లు ప్రోమోలో కనిపించింది. రైజింగ్స్ స్టార్స్‌లో కిరాక్ సీత, రోహిణి, యష్మి, ప్రేరణ, గంగవ్వ, మణికంఠ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫాలింగ్ స్టార్స్‌లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ,ప్రేరణ, అవినాష్, హరితేజ, టేస్టీతేజతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ...
విష్ణుప్రియ ఆటతీరు విషయంలో నాగార్జున ఫైర్ కానున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ టేస్టీతేజ, గౌతమ్ కృష్ణ హౌజ్‌లో డల్‌గానే కనిపిస్తోన్నారు. వారి వాయిస్, టాస్క్‌లలో ఇన్‌వాల్వ్ మెంట్ ఈ వీక్ పెద్దగా లేదు.
దానిపై కూడా నాగార్జున ఒక్కొక్కరితో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. దసరా ఎపిసోడ్‌లో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరన్నది మాత్రం ప్రోమోలో చూపించబోతున్నాడు.