Bigg Boss Nominations: ఆమెను నామినేట్ చేసినందుకు లక్ష ప్రైజ్ మనీ కట్.. అతనికే అధిక ఓట్లు.. ఈవారం నామినేషన్స్‌లో ఆరుగురు
Bigg Boss Telugu 8 Nominations Eight Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వారిలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్‌ను నామినేట్ చేసినందుకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుంచి రూ. లక్ష కట్ చేశారు. బిగ్ బాస్ 8 తెలుగు 8వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 8 Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ అక్టోబర్ 21న ప్రారంభమైంది. దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. అయితే, మెగా చీఫ్ అయినందుకు గౌతమ్ కృష్ణను ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ తెలిపాడు.
ప్రైజ్ మనీ నుంచి కట్
అలాగే, ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది. ఆ నామినేషన్ షీల్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ. 50 వేలు బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దాంతో ఆ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు మెగా చీఫ్ గౌతమ్.
బిగ్ బాస్ తెలుగు 1లో ఆమె ఫైర్ చూశాను. ఈ వారం సేవ్ అయి మరో వారం వరకు ఉండి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో హరితేజకు ఆ నామినేషన్ షీల్డ్ ఇస్తున్నట్లు గౌతమ్ తెలిపాడు. విష్ణుప్రియతో బిగ్ బాస్ 8 తెలుగు 8వ వారం నామినేషన్స్ ప్రారంభమైంది. ప్రేరణ, నిఖిల్‌ను విష్ణుప్రియ నామినేట్ చేస్తే.. పృథ్వీ, నిఖిల్‌ను రోహిణి నామినేట్ చేశారు.
పృథ్వీ వర్సెస్ రోహిణి
అలాగే, మెహబూబ్, నిఖిల్‌ను నయని పావని నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చి రోహిణిపై రివేంజ్ నామినేషన్ వేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ సాగింది. అలాగే, ప్రేరణను కూడా పృథ్వీ నామినేట్ చేశాడు. అనంతరం ప్రేరణ, మెహబూబ్‌ను హరితేజ నామినేట్ చేసింది. నబీల్ వచ్చి ప్రేరణ అండ్ హరితేజను నామినేట్ చేశాడు.
హరితేజను నామినేట్ చేస్తే 50 వేల రూపాయలు కట్ అవుతాయని హౌజ్‌మేట్స్ గుర్తు చేశారు. డబ్బులు డిడక్ట్ కానీ, నా నామినేషన్ పాయింట్ తను మాత్రమే అని విన్నర్ ప్రైజ్ మనీ గురించి లెక్క చేయకుండా హరితేజను నామినేట్ చేశాడు నబీల్. అక్కడితో సోమవారం (అక్టోబర్ 21) నాటి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.
మరో 50 వేలు గోవిందా
ఇక ఇవాళ అంటే మంగళవారం (అక్టోబర్ 22) రెండో రోజు బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ కొనసాగనున్నాయి. ఈవారం రెండో రోజు నామినేషన్స్‌లో విష్ణుప్రియ, మెహబూబ్‌ను యష్మీ నామినేట్ చేయనుందని సమాచారం. అలాగే, పృథ్వీ, నిఖిల్‌ను అవినాష్, నిఖిల్, విష్ణుప్రియను గంగవ్వ నామినేట్ చేయనుందని తెలుస్తోంది. హరితేజను కూడా మరొకరు నామినేట్ చేయడంతో మరో రూ. 50 వేలు కట్ అయినట్లు టాక్.
అలా మొత్తంగా హరితేజను ఇద్దరు నామినేట్ చేయడంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుంచి రూ. లక్ష కట్ అయినట్లు సమాచారం. ఇక ఈ వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఐదు నామినేషన్ ఓట్లు నిఖిల్‌కు పడ్డాయి. దాంతో అతడు చాలా బాధపడినట్లు సమాచారం. "నేను కనపడట్లేదు అంటున్నారు గానీ ఎక్కడ కనిపట్లేదో చెప్పట్లేదు" అని తన గోడు వెళ్లబోసుకున్నాడని తెలుస్తోంది.
నామినేషన్స్‌లో ఆరుగురు
ఇక బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వారిలో నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నయని పావని, మెహబూబ్ నామినేట్ అయ్యారు. హరితేజకు నామినేషన్ షీల్డ్ ఉండటంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయింది.