Bigg Boss Elimination: బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో గజిబిజి.. మధ్యలో నో ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?-bigg boss telugu 8 fourteenth week elimination vishnupriya or rohini bigg boss 8 telugu elimination this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో గజిబిజి.. మధ్యలో నో ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss Elimination: బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో గజిబిజి.. మధ్యలో నో ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Elimination Fourteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం రెండు సార్లు ఎలిమినేషన్ ఉండనుందని టాక్ నడిచింది. కానీ, మధ్యలో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వీకెండ్‌లోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఈ సారి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో చాలా గజిబిజి నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో గజిబిజి.. మధ్యలో నో ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ద్వారా టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. అయితే, ఇందుకు ఈ వారం చాలా కీలకంగా మారింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం నామినేషన్స్ డైరెక్ట్‌గా జరిగాయి. కానీ, తర్వాత సేఫ్ టాస్క్ ఒకటి ఇచ్చి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. సేఫ్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారో పాయింట్స్ చెప్పి వారి ఫొటో కాలిపోయేలా చేయాలని చెప్పాడు. ఈ టాస్క్ అనంతరం టికెట్ టు ఫినాలే పొందిన మొదటి బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ అయిన అవినాష్ తప్పా మిగతా హౌజ్‌మేట్స్ అంతా నామినేట్ అయ్యారు.

గజిబిజిగా ఓటింగ్ స్థానాలు

దాంతో బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్ వీక్ నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, రోహిణి, నబీల్, ప్రేరణ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరికి మొదటి రోజు నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాలు గజిబిజిగా ఉన్నాయి. ఒక పోల్‌లో 27.85 శాతం ఓటింగ్, 9,329 ఓట్లతో గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు.

నిఖిల్‌కు రెండో స్థానం

21.26 శాతం ఓటింగ్, 7,123 ఓట్లతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, ప్రేరణ 15.96 శాతం ఓటింగ్ (5,348 ఓట్లు)తో మూడో స్థానంలో, జబర్దస్త్ రోహిణి 12.56 శాతం ఓటింగ్ (4,208 ఓట్లు)తో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక విష్ణుప్రియ ఐదో స్థానం దక్కించుకుని 11.83 శాతం ఓటింగ్, 3,963 ఓట్లు రాబట్టుకుంది. చివరి ఆరో స్థానంలో 10.54 శాతం ఓటింగ్, 3,531 ఓట్లతో నబీల్ ఉన్నాడు.

మధ్యలో నో ఎలిమినేషన్

అంటే, ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారం డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ, నబీల్ ఉన్నారు. అయితే, ఇంతకుముందు ఈ వారం మధ్యలో ఒక ఎలిమినేషన్, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నారని టాక్ నడిచింది. కానీ, అలాంటిదేం లేకుండా ఎప్పటిలాగే వీకెండ్‌లో మాత్రమే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాలు చాలా గందరగోళంగా ఉన్నాయి.

ఆ ముగ్గురు కూడా

పైన పేర్కొన్న ఓటింగ్ పోల్స్‌లో గౌతమ్ టాప్‌లో ఉంటే.. అఫిషియల్ ఓటింగ్‌లో నిఖిల్ టాప్ 1లో గౌతమ్ టాప్ 2లో ఉన్నాడు. ఈ ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్‌లో ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఉంటే.. అఫిషియల్ ఓటింగ్ పోల్స్‌లో విష్ణుప్రియ, రోహిణి డేంజర్ జోన్‌లో ఉన్నారు. కొన్ని పోల్స్‌లో నబీల్, ప్రేరణ, రోహిణి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు.

వీరిద్దరి మధ్యలోనే

అయితే, అన్ని ఓటింగ్ పోల్స్‌లో యాంకర్ విష్ణుప్రియ డేంజర్ జోన్‌లో ఉంది. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె తర్వాత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ రోహిణికి ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం విష్ణుప్రియ లేదా రోహిణిలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లుగా సమాచారం.