Dattatreya Stotram: గురువారం దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.. దేవతలందరి ఆశీర్వాదాలు పొందండి-dattatreya stotram benefits significance and mantras gives you huge knowledge luck and money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dattatreya Stotram: గురువారం దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.. దేవతలందరి ఆశీర్వాదాలు పొందండి

Dattatreya Stotram: గురువారం దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.. దేవతలందరి ఆశీర్వాదాలు పొందండి

Ramya Sri Marka HT Telugu
Dec 05, 2024 06:35 AM IST

Dattatreya Stotram: సకల దేవతల అవతార మూర్తి దత్తాత్రేయ భగవానుడు అని పురాణాలు చెబుతున్నాయి. దత్తాత్రేయుని పూజిస్తే అందరు దేవుళ్ల ఆశీస్సులను పొందవచ్చని నమ్మిక. దత్తాత్రేయ స్తోత్ర ప్రత్యేకత తెలుసుకుని ఈ స్త్రోత్రాన్ని మనసారా పఠించండి.

దత్తాత్రేయ స్తోత్రం
దత్తాత్రేయ స్తోత్రం

దత్తాత్రేయుడు బ్రహ్మా,విష్ణు, మహేశ్వరులను తనలో ఇముడ్చుకున్న సర్వశక్తిమంతుడు దత్తాత్రేయుడు.అతను సృష్టి, స్థితి, లయ అనే మూడు అంశాలను తనలో సమన్వయం చేసుకున్నాడు. కరుణ, దయ, క్షమా, సత్యం, ధైర్యం వంటి అన్ని శుభగుణాలకు ప్రతీక. దతాత్రేయుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితంలోని సకల సమస్యలు తొలగిపోతాయని నమ్మిక. ఆధ్యాత్మికంగా పరిణతి చెందవచ్చు.దత్తాత్రేయుడు జ్ఞాన సంపన్నుడు కాబట్టి, ఆయన్ని ఆరాధించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. దత్తాత్రేయుడి ఆశీర్వాదంతో మనస్సు శాంతంగా ఉంటుంది. మోక్షం లభిస్తుందని నమ్మకం. దత్తాత్రేయుడి ఆరాధనలో ప్రాముఖ్యత సంతరించుకున్న దత్తాత్రేయ స్త్రోత్రాన్ని మీరు ఇక్కడ పఠించవచ్చు.

దత్తాత్రేయ స్తోత్రం:

జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్

సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే

భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయచ

దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే

కర్పూర కాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయచ

వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత

పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయచ

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవస్సదాశివః

మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే

జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయచ

సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే

జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే

నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే

ప్రజ్ఞాన ఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే

విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ

సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర

యజ్ఞసూత్ర ధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే

క్షరాక్షర స్వరూపాయ పరాత్పరతరాయచ

దత్తముక్తి పరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే

గుణనిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్

దత్తాత్రేయ ప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్

దత్తాత్రేయ ప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్

ఇంతటితో దత్తాత్రేయ స్తోత్రం సమాప్తం

Whats_app_banner