Thursday Motivation: రాత్రి మంచం పక్కన చిన్న దీపాన్ని వెలిగిస్తే జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందంటున్న సద్గురు
Thursday Motivation: అగ్ని పంచభూతాల్లో ఒకటి. ఇది జీవితంలోని శక్తిని సూచిస్తుంది. నిద్రపోయే ముందు మంచం దగ్గర చిన్న దీపం వెలిగించండి చాలు. అది మీలో ఎంతో సానుకూల శక్తిని పెంచుతుంది.
ఈ విశ్వంలో పంచభూతాలు అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశం. ఈ అయిదు అతి ముఖ్యమైనవి. వీటిలో అగ్ని కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది జీవితంలోని కాంతి రేఖలను సూచిస్తుంది. చీకటి నుండి ప్రజలను చీకట్లో ఉన్న ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తుంది. వారి భయాలను అధిగమించేందుకు సహాయపడుతుంది. ప్రాచీన నమ్మకాలలో కూడా అగ్నికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
సద్గురు చెబుతున్న ప్రకారము నిద్రపోయే ముందు మంచం పక్కన ఒక సురక్షితమైన ప్రదేశంలో చిన్న దీపం వెలిగించుకోండి. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి. నేలపైనే చిన్న దీపాన్ని పెడితే ఎలాంటి సమస్య ఉండదు. దీనికి దగ్గరగా ఎలాంటి కర్టెన్లు, వస్తువులు లేకుండా చూసుకోండి. ప్రాచీన కాలంలో ప్రతి ఇంటిలో ఒక దీపం కచ్చితంగా వెలిగించేవారు. ఆ దీపాన్ని వెలిగించేందుకు ఒక పవిత్ర స్థలాన్ని కూడా కేటాయించేవారు. మీరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మీకు దగ్గరగా అగ్నిని ఉంచడం వల్ల మీ శరీరంలోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
మీరు నిద్రిస్తున్నప్పుడు సమీపంలోనే చిన్న దీపాన్ని వెలిగించుకోవడం వల్ల ఆ ప్రదేశం అంతా శక్తిమయం అవుతుంది. అంతేకాదు మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా మారుతుంది. మీకు బాగా నిద్ర పట్టేలా చేస్తుంది. ప్రశాంతమైన శక్తి మీ గదిలో ఆవరిస్తుంది. దీపం వెలిగించడం వల్ల మీలో సానుకూలత, ప్రశాంతత పెరుగుతాయి. ఆ కాంతి చెందిన వెచ్చదనం, మెరుపు వంటివి మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. నిద్రపోయేటప్పుడు మేల్కొనే సమయంలో కూడా సానుకూల ఆలోచనలతో మీరు ఉంటారు.
మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తులను దూరంగా ఉంచేందుకు కూడా ఈ చిన్న దీపం పనిచేస్తుంది. నిద్రించడానికి శరీరానికి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కావడం అవసరం. చీకటిలో మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అయితే పూర్తిగా చీకటిలోనే నిద్రించడం ఉత్తమ పద్ధతి కాదు. చిన్న దీపం, చిరు వెలుగు ఎంతో అవసరం. ఇది వెచ్చని వాతావరణాన్ని సహజమైన జ్వాలనే అందిస్తుంది. ఇది మనస్సు, శరీరాన్ని శాంత పరుస్తుంది.
విద్యుత్ దీపాలు ఒకప్పుడు లేవు. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేందుకు చాలా సమయం పట్టింది. అంతవరకు వివిధ సంస్కృతుల్లో నూనె దీపాలని వాడేవారు. ఈ నూనె దీపానికి ఎంతో వెలుగును అందాన్ని అందించేది. ఇలా నూనె దీపాలతో ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని కూడా చెప్పుకుంటారు.
ఇంట్లో చిన్న దీపాన్ని వెలిగించడం వల్ల ఆ గృహంలో శక్తివలయం ఏర్పడుతుంది. మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు పెరుగుతాయి. మీకు తెలియకుండానే ఆ దీపం మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది.
రాత్రి నిద్రపోయే ముందే కాదు, ఉదయం లేచి స్నానం చేశాక కూడా దీపాన్ని వెలిగించి సానుకూల పద్ధతిలో మీ జీవితాన్ని రోజును ప్రారంభించండి. ఆ రోజంతా మీకు ప్రశాంతంగా సాగుతుంది.