Pushpa Movie Tragedy: పుష్ప2 మూవీ రిలీజ్‌‌లో విషాదం, తొక్కిసలాటలో మహిళ మృతి..బాలుడి పరిస్థితి విషమం-rtc cross roads stampede woman killed during pushpa 2 premiere ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pushpa Movie Tragedy: పుష్ప2 మూవీ రిలీజ్‌‌లో విషాదం, తొక్కిసలాటలో మహిళ మృతి..బాలుడి పరిస్థితి విషమం

Pushpa Movie Tragedy: పుష్ప2 మూవీ రిలీజ్‌‌లో విషాదం, తొక్కిసలాటలో మహిళ మృతి..బాలుడి పరిస్థితి విషమం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 05, 2024 06:11 AM IST

Pushpa Movie Tragedy: పుష్ప 2 సినిమా రిలీజ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

పుష్ప 2 ప్రీమియర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడికి అస్వస్థత
పుష్ప 2 ప్రీమియర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడికి అస్వస్థత

Pushpa Movie Tragedy: హైదరాబాద్‌లో పుష్ప 2 సినిమా రిలీజ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంధ్య ధియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని కాపాడేందుకు పోలీస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సీపీఆర్‌ చేసి శ్వాస అందించే ప్రయత్నించారు.

బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న పుష్ప2 ప్రిమియర్ షో కోసం సంధ్య థియేటర్ కు అల్లుఅర్జున్ వచ్చారు. అభిమానులతో కలిసి పుష్ప2 చిత్రాన్ని వీక్షించేందుకు అల్లు అర్జున్ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అల్లుఅర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అల్లు అర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం బన్నీ అభిమానులతో నిండిపోయింది. ఈ క్రమంలోనే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తొక్కిసలాటలో చిక్కుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అస్వస్థతకు గురైన పిల్లలకు సీపీఆర్ చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు. థియేటర్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

దిల్‌షుక్‌ నగర్‌కు చెందిన రేవత్-భాస్కర్‌ దంపతులు పిల్లలు శ్రీతేజ్, సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70ఎంఎంబి ధియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యా నగర్ లోని దుర్గా భాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు

తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విష మంగా ఉన్నట్లు సమాచారం. రాత్రి 8:30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్వీక దిల్‌‌సుఖ్‌ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కు వచ్చారు. అదే సమ యంలో... హీరో అల్లు అర్జున్ సంధ్య థియటర్ వద్ద కు వచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.

అల్లు అర్జున్ థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ సమయంలో తోపులాటలో రేవతి, ఆమె కుమా రుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి, ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసు కొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. స్పృహత ప్పిన బాలుడికి పోలీసులు సీపీఆర్ చేస్తూ నోటితో శ్వాస అందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Whats_app_banner