Telugu Cinema News Live December 5, 2024: Allu Arjun Case: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా చిక్కుల్లో
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 05 Dec 202404:36 PM IST
Pushpa 2 screening: అభిమానులతో కలిసి పుష్ప 2 బెనిఫిట్ షోను చూసేందుకు సడన్‌గా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వచ్చారు. దాంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా… ఆమె కొడుకు..?
Thu, 05 Dec 202403:20 PM IST
Keerthy Suresh Wedding Date: కీర్తి సురేశ్ తాను ప్రేమించి వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకోబోతోంది. 15 ఏళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇన్నాళ్లు ప్రియుడి వివరాల్ని గోప్యంగా ఉంచిన కీర్తి సురేశ్.. ఇటీవల ఒక పోస్టుతో అందరికీ క్లారిటీ ఇచ్చింది.
Thu, 05 Dec 202402:39 PM IST
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవిని పుష్ప 2 టీమ్ కలిసింది. పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు నిర్మాతలు రవిశంకర్, నవీన్ గురువారం చిరంజీవిని ఆయన ఇంట్లో కలిశారు. అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి ఇంటికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Thu, 05 Dec 202401:51 PM IST
Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ నీతి టేలర్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించింది నీతి టేలర్. తెలుగులో మేం వయసుకు వచ్చాం, పెళ్లిపుస్తకంతో పాటు మరో సినిమా చేసింది నీతి టేలర్.
Thu, 05 Dec 202401:30 PM IST
Ram Prasad Accident: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి జబర్దస్త్‌లో పంచ్‌లు వేస్తూ ఆటో రామ్‌ప్రసాద్‌గా గుర్తింపు పొందిన కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతకి కారు ముందు భాగం బాగా దెబ్బతింది.
Thu, 05 Dec 202412:03 PM IST
Amaran Movie On OTT: అమరన్ మూవీ కోసం గత కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.. ఓటీటీలో ఇప్పుడు ఆ మూవీని చూస్తూ ట్విట్టర్‌లో పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?
Thu, 05 Dec 202412:00 PM IST
Sci -Fi Thriller OTT: తెలుగు మైథలాజికల్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 26 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ హీరోహీరోయిన్లుగా నటించారు.
Thu, 05 Dec 202411:00 AM IST
Pushpa 3: పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3ని మేకర్స్ అనౌన్స్‌చేశారు. పుష్ప ది రాంపేజ్ పేరుతో మూడో భాగం తెరకెక్కుతోన్నట్లు ప్రకటించారు. పుష్ప 3 స్టోరీపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తోన్నాయి. మూడో పార్ట్ షూటింగ్ 2028లో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతోన్నారు.
Thu, 05 Dec 202410:45 AM IST
- Producer Bellamkonda Suresh Film Journey: తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పేరొందిన బెల్లంకొండ సురేష్ సినీ కెరీర్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయింది. డిసెంబర్ 5న 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ సురేష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. ఈ 25 ఏళ్లలో తాను 38 సినిమాలు చేసినట్లు తెలిపారు.
Thu, 05 Dec 202410:08 AM IST
Allu Arjun Pushpa 2 film leaked: పుష్ప 2 సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఈ పని ఎవరు చేశారంటే?
Thu, 05 Dec 202409:38 AM IST
Guppedantha Manasu Mahendra: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ సాయికిరణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. కోయిలమ్మ సీరియల్ నటి స్రవంతితో ఏడడుగులు వేయనున్నాడు. డిసెంబర్ 7న వీరి పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు సాయికిరణ్, స్రవంతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Thu, 05 Dec 202409:03 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 10 సినిమాలు స్పెషల్‌గా ఉండగా అవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా వాటిలో ఆరు రొమాంటిక్ జోనర్ మూవీస్‌తోపాటు ఒక హారర్ సినిమా కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
Thu, 05 Dec 202408:52 AM IST
Pushpa 2 OTT Release: థియేటర్లలో పుష్ప2 సందడి మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో పుష్ప2 మూవీ రిలీజ్ అవగా.. తొలిరోజే భారీగా వసూళ్లని రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
Thu, 05 Dec 202408:41 AM IST
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రోటి కప్‌డా రొమాన్స్ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీలో హర్ష నర్రా, సుప్రజ్ రంగా, సందీప్ సరోజ్, తరుణ్ హీరోలుగా నటించారు.
Thu, 05 Dec 202408:00 AM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
Thu, 05 Dec 202407:22 AM IST
Pushpa 2 Day 1 Worldwide Box Office Collection: పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్‌తో అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్‌కెక్కనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ డే రోజున పుష్ప 2 మూవీ సుమారుగా రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టనుందని అంచనా వేశారు.
Thu, 05 Dec 202406:34 AM IST
- Naga Chaitanya Wedding: నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆమె మెడలో చైతూ మూడు ముళ్లు వేసే సమయంలో పక్కనే ఉన్న అఖిల్ అక్కినేని విజిల్ వేయడం ఇందులో చూడొచ్చు.
Thu, 05 Dec 202406:21 AM IST
- Karthika Deepam 2 Serial December 5th Episode: కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 5వ తేది ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో స్పృహలోకి వచ్చిన కూతురు జ్యోత్స్నకు దాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీపను చంపాలనుకుంది చూశానని, ఇంకోసారి ఇలా చేస్తే గీత దాటుతానని, అలా చేస్తే ఏం అవుతుందో తెలుసు కదా అని చెబుతాడు దాస్.
Thu, 05 Dec 202405:28 AM IST
- Pushpa 2 Dialogues: పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో వివాదం నేపథ్యంలో ఈ డైలాగ్స్ విని అల్లు ఫ్యాన్స్ ఏదేదో ఊహించేసుకుంటున్నారు.
Thu, 05 Dec 202404:23 AM IST
- Gunde Ninda Gudi Gantalu Serial December 5 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో వడ్డీ వ్యాపారిని మీనా అడగడం చూసిన రోహిణి ఇరికించాలని అనుకుంటుంది. సత్యంతో ఇంట్లో పంచాయితీ పెడుతుంది. కానీ, నిజం తెలిసి బాలు, మీనాలకు సపోర్ట్ చేస్తాడు సత్యం. మీనాపై చేయి ఎత్తుతాడు బాలు.
Thu, 05 Dec 202403:28 AM IST
- Samantha Reaction: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అద్భుతమైన ప్రయాణం అంటూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
Thu, 05 Dec 202403:15 AM IST
- Brahmamudi Serial December 5th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 5 ఎపిసోడ్‌లో కల్యాణ్ ఇంటికి అనామిక వస్తుంది. రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర కల్యాణ్ ఊడిగం చేస్తున్నాడని, రైటర్ కాదని అగ్రిమెంట్ నిజం బయటపెడుతుంది అనామిక. ధాన్యలక్ష్మీ రచ్చతో సీతారామయ్యకు గుండెపోటు వస్తుంది. ప్రాణపాయ స్థితిలో తాతయ్య ఉంటాడు.
Thu, 05 Dec 202402:40 AM IST
- Allu Arjun Son: పుష్ప 2 మూవీ రిలీజ్ కు కాస్త ముందు తన కొడుకు తనకు ప్రేమతో రాసిన లేఖను అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. ప్రపంచంలోనే గొప్ప నటుడు అంటూ అందులో తన తండ్రి గురించి అయాన్ రాయడం విశేషం.
Thu, 05 Dec 202402:07 AM IST
- Nindu Noorella Saavasam December 5th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో తీవ్రవాదులు వేసిన ట్రాప్‌లో అమర్ పడిపోతాడు. పిల్లలు ఎక్స్‌కర్షన్‌కు వెళ్తారు. ఆ బస్ డ్రైవర్‌ను అరవింద్ కిడ్నాప్ చేసి అతని స్థానంలో తన మనిషిని పంపిస్తాడు. మరోవైపు అత్త నిర్మలను పట్టించుకోనంత పరధ్యానంలో ఉంటుంది.
Thu, 05 Dec 202401:39 AM IST
- Pushpa 2 Twitter Review: పుష్ప 2 మూవీ మెగా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు తేల్చేశారు. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి నుంచే స్పెషల్ షోలు ప్రారంభం కావడంతో రాత్రంతా ఎక్స్ వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తుండటం విశేషం.
Thu, 05 Dec 202412:55 AM IST
- Bigg Boss Telugu 8 Elimination Fourteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం రెండు సార్లు ఎలిమినేషన్ ఉండనుందని టాక్ నడిచింది. కానీ, మధ్యలో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వీకెండ్‌లోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఈ సారి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో చాలా గజిబిజి నెలకొన్నట్లుగా తెలుస్తోంది.