Kannada OTT: ఓటీటీలోకి టాలీవుడ్ హీరోయిన్ కన్నడ రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kannada OTT: ఈ ఏడాది కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా కృష్ణం ప్రణయ సఖి మూవీ నిలిచింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 29 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన కృష్ణం ప్రణయ సఖి మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 29 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ కన్నడ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
తెలుగు హీరోయిన్...
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీలో గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ హీరోయిన్ మాళవికా నాయర్ కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మాళవికా నాయర్‌తో పాటు శరణ్య శెట్టి మరో కథానాయికగా కనిపించింది. ఈ కన్నడ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు.
30 కోట్ల కలెక్షన్స్...
కృష్ణమ్ ప్రణయ సఖి 2024లో కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూడో సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. కాన్సెప్ట్‌తో పాటు కామెడీ బాగుందంటూ మౌత్‌టాక్ రావడంలో వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.
కృష్ణమ్ ప్రణయ సఖి కథ ఇదే...
కృష్ణ (గణేష్) హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్‌బీఏ పూర్తి చేస్తాడు. ఫ్యామిలీ బిజినెస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. 30 ఏళ్లు వచ్చిన పెళ్లి ఊసు ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులే అతడి కోసం సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఉమ్మడి కుటుంబంలో పుట్టిన, అనుబంధాలు, ఆప్యాయతల్ని కోరుకునే అమ్మాయి తన భార్యగా రావాలని కృష్ణ కోరుకుంటాడు. అనుకోకుండా అతడికి ప్రణయ (మాళవికానాయర్) తో పరిచయం ఏర్పడుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు.
ప్రణయ అనాథశ్రమంలో పెరిగిందనే నిజం కృష్ణకు తెలుస్తుంది. ఆమె ప్రేమ కోసం కోటీశ్వరుడిననే నిజాన్ని దాచి డ్రైవర్‌గా నాటకం ఆడుతాడు.మరోవైపు కృష్ణను పెళ్లిచేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బతుకుతుంటుంది జాహ్నవి (శరణ్య శెట్టి). ప్రణయ, జాహ్నవిలలో కృష్ణ ఎవరిని పెళ్లిచేసుకున్నాడు? కృష్ణ కోటీశ్వరుడు అనే నిజం ప్రణయకు తెలిసిందా? అనాథ అయిన ప్రణయతో కృష్ణ ప్రేమను అతడి కుటుంబసభ్యులు అంగీకరించారా? లేదా? అన్నదే కృష్ణం ప్రణయ సఖి మూవీ కథ.
ఎవడే సుబ్రహ్మణ్యంతో...
టాలీవుడ్‌లో కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది మాళవికా నాయర్. నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికా నాయర్... మహానటి, ట్యాక్సీవాలా, కళ్యాణ వైభోగమే సినిమాలతో విజయాలను అందుకున్నది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శర్వానంద్ కెరీర్‌లో 36వ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కృష్ణం ప్రణయ సఖి మూవీతో తొలి అడుగులోనే కన్నడం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ మూవీ హిట్‌తో మరో రెండు కన్నడ సినిమాల్లో మాళవికా నాయర్‌కు అవకాశాలు దక్కినట్లు సమాచారం.