తెలుగు న్యూస్ / ఫోటో /
Nidhhi Agerwal: అందరికి నమస్కారం అనే బ్యాచ్ నేను కాదు - నిధి అగర్వాల్ కామెంట్స్
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు దాటింది. 2022లో వచ్చిన హీరో మూవీతో చివరగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతుంది
(1 / 5)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ప్రభాస్ రాజా సాబ్ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారయ్యాయి.
(2 / 5)
మంగళవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన నిధి అగర్వాల్ కొత్త సినిమాలతో పాటు తన యాక్టింగ్ జర్నీ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
(3 / 5)
మీకు తెలుగు వచ్చా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు..వస్తుంది అని రిప్లై ఇచ్చింది. అందరికి నమస్కారం వరకు మాత్రమే తెలుగు వచ్చే బ్యాచ్ నేను కాదంటూ సమాధానమిచ్చింది.
(4 / 5)
మంచి సినిమాలు చేయాలనే ఆలోచనవల్లే తెలుగులో కొంత బ్రేక్ వచ్చిందని నిధి అగర్వాల్ అన్నది. హరి హర వీరమల్లు, రాజాసాబ్‌తో మరో వచ్చే ఏడాది మరో సర్‌ప్రైజింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది.
ఇతర గ్యాలరీలు