ITBP recruitment: ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం; లాస్ట్ డేట్ దగ్గర్లోనే..-itbp constable si registration begins today apply for 526 vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itbp Recruitment: ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం; లాస్ట్ డేట్ దగ్గర్లోనే..

ITBP recruitment: ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం; లాస్ట్ డేట్ దగ్గర్లోనే..

Sudarshan V HT Telugu
Nov 15, 2024 09:40 PM IST

ఐటీబీపీఎఫ్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

 ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్
ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ ల భర్తీకి రిజిస్ట్రేషన్

ITBP SI, Constable Recruitment 2024: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) లో సబ్ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఐటీబీపీఎఫ్ అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

లాస్ట్ డేట్..

ఐటీబీపీ ఎస్ఐ, కానిస్టేబుల్ (టెలీకమ్యూనికేషన్) పోస్ట్ ల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 14. ఎస్సై (గ్రూప్ బి), కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ (గ్రూప్ సి) ఖాళీలు పురుష, మహిళా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఇవి తాత్కాలిక ప్రాతిపదికన జరుగుతున్న నియామకాలు.

ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ 2024: జెండర్, పోస్టుల వారీగా ఖాళీల పంపిణీ

సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్): 92 ఖాళీలు (78 పురుషులు, 14 మహిళలు)

హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 383 ఖాళీలు (325 పురుషులు, 58 మహిళలు)

కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 51 ఖాళీలు (44 పురుషులు, 7 మహిళలు)

మొత్తం ఖాళీల్లో పది శాతం ఎక్స్ సర్వీస్మెన్ (ESM)కు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈఎస్ఎం అభ్యర్థులకు కేటాయించిన ఖాళీలు భర్తీ కాకపోతే, వాటిని నాన్ ఈఎస్ఎం అభ్యర్థులతో భర్తీ చేస్తామని ఐటీబీపీ (ITBP) తెలిపింది. డిసెంబర్ 14 నాటికి 20-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుళ్ల పోస్టులకు 18-25 ఏళ్లు, హవల్దార్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హతలు

ప్రతి పోస్టుకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.అభ్యర్థులు మరింత సమాచారం కోసం వివరణాత్మక నోటిఫికేషన్ చూడవచ్చు. రిక్రూట్ మెంట్ పరీక్షలో టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన సబ్జెక్టుల్లో డిగ్రీ హోల్డర్లకు ఐదు మార్కులు, డిప్లొమా సర్టిఫికెట్ హోల్డర్లకు మూడు మార్కులు, ఐటీఐ సర్టిఫికెట్ హోల్డర్లకు రెండు మార్కులు ఇస్తారు.

జీతం/పే మ్యాట్రిక్స్

ఎస్ఐ పోస్టులకు: రూ.35,400-1,12,400 (లెవల్ 6)

హెడ్ కానిస్టేబుల్: రూ.25,500 నుంచి రూ.81,100 (లెవల్ 4),

కానిస్టేబుల్: రూ.21,700 నుంచి రూ.69,100 (లెవల్ 3).

దరఖాస్తు ఫీజు ఎస్ ఐ పోస్టులకు రూ.200, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.100. మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఐటీబీపీ కానిస్టేబుల్, ఎస్ఐ (టెలికమ్యూనికేషన్) రిక్రూట్మెంట్ 2024 గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.

Whats_app_banner