CBSE news: సీబీఎస్ఈ 9, 10 తరగతుల్లో ఈ సబ్జెక్టులకు కూడా ఇక టూ లెవెల్ ఎగ్జామ్ స్ట్రక్చర్!-cbse plans two level structure for science and social science in classes 9 10 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cbse News: సీబీఎస్ఈ 9, 10 తరగతుల్లో ఈ సబ్జెక్టులకు కూడా ఇక టూ లెవెల్ ఎగ్జామ్ స్ట్రక్చర్!

CBSE news: సీబీఎస్ఈ 9, 10 తరగతుల్లో ఈ సబ్జెక్టులకు కూడా ఇక టూ లెవెల్ ఎగ్జామ్ స్ట్రక్చర్!

Sudarshan V HT Telugu
Dec 04, 2024 02:02 PM IST

CBSE news: ప్రస్తుతం సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు గణితంలో టూ లెవెల్ స్ట్రక్చర్ ను అమలు చేస్తుంది. ఈ విధానంలో విద్యార్థులు బేసిక్, లేదా అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ ను ఎంపిక చేసుకోవచ్చు. త్వరలో ఈ విధానాన్ని 9, 10 తరగతుల విద్యార్థులకు సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో కూడా అమలు చేయాలని సీబీఎస్ఈ భావిస్తోంది.

సీబీఎస్ఈ
సీబీఎస్ఈ

CBSE news: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 9 మరియు 10 తరగతులకు సైన్స్ మరియు సోషల్ సైన్స్ (బేసిక్, అడ్వాన్స్డ్) లకు కూడా టూ లెవెల్ స్ట్రక్చర్ ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది 2026-2027 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విధానం సీబీఎస్ఈ 10 వ తరగతి (cbse class 10) మేథ్స్ సబ్జెక్ట్ లో అమల్లో ఉంది.

2026 విద్యా సంవత్సరం నుంచి

CBSE పాఠ్యప్రణాళిక మండలి ఇటీవల ఈ అంశాలను రెండు వేర్వేరు స్థాయిలలో అందించాలని నిర్ణయించింది. బోర్డు పాలకమండలి నుండి తుది అనుమతి వచ్చిన తరువాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. సీబీఎస్ఈ కి సంబంధించిన నిర్ణయాల్లో పాలక మండలిదే అత్యున్నత నిర్ణయాధికారం. అడ్వాన్స్డ్ లెవెల్ ను ఎంచుకునే విద్యార్థులకు వేర్వేరు స్టడీ మెటీరియల్‌లను ఉపయోగిస్తారా? లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.

కొత్త టెక్ట్స్ బుక్స్

1 , 2 తరగతులకు గత సంవత్సరం, 3, 6 తరగతులకు ఈ సంవత్సరం కొత్త పాఠ్యపుస్తకాలను అందించారు. 2025 లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో మరికొన్ని తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ విడుదల చేయనుంది.

జాతీయ విద్యా విధానం

జాతీయ విద్యా విధానం, 2020 ప్రకారం, "గణితంతో ప్రారంభించి అన్ని సబ్జెక్టులు, సంబంధిత అసెస్‌మెంట్‌లు రెండు స్థాయిలలో ఉంటాయి. విద్యార్థులు తమ సబ్జెక్టులలో కొన్నింటిని ప్రామాణిక స్థాయిలో, మరికొన్నింటిని ఉన్నత స్థాయిలో ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులపై ఒత్తిడిని, కోచింగ్ సంస్కృతిని తగ్గించడానికి ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం 10 వ తరగతిలో..

సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతిలో ప్రస్తుతం గణితం (స్టాండర్డ్), గణితం (బేసిక్) ఆప్షన్స్ ఉన్నాయి. అయితే, ఈ ఆప్షన్స్ ఎంచుకునే విద్యార్థుల మాత్రం సిలబస్ ఒకేలా ఉంటుంది. అయితే బోర్డు పరీక్షలో ప్రశ్నపత్రాలు, ప్రశ్నల క్లిష్టత స్థాయి మారుతుంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. 2023–24 పరీక్షలో, CBSE గణాంకాల ప్రకారం, బేసిక్ (6,79,560) కంటే ఎక్కువ మంది విద్యార్థులు గణితం యొక్క స్టాండర్డ్ స్థాయి (15,88,041) కోసం నమోదు చేసుకున్నారు.

Whats_app_banner