బచ్చలిలో విటమిన్ సి, ఇ, ఒమెగా 3, ఫ్యాటీ యాసిడ్స్, బెటా కెరోటిన్, పోలిఫెనాల్స్, బెటైన్, ల్యూటెన్ ఉంటాయి.
బచ్చలి ఆకుల్ని ఆహారంలో తీసుకోవడం వల్ల హృద్రోగాలు దూరం చేయొచ్చు. పక్షవాతం, కోలన్, ఉదర సమస్యలు, ఒవేరియన్, ప్రొస్టేట్ సమస్యలు దరి చేరవు.
బ్రెస్ట్ సమస్యలు, ఊపిరితిత్తులు, నోరు, చర్మ క్యాన్సర్లు, వృద్ధుల్లో అంధత్వానికి దారి తీసే మాక్యులర్ డీ జనరేషన్‌ను బచ్చలి ఆకులు నివారిస్తాయి.
బచ్చలి ఆకుల్లో ఉండే యాంటీ ఆసిడ్స్, వాటిలో నియోజ్ఞాంతిన్, వయోలాక్జాంతిన్ కణాలలో వంశ పారంపర్యంగా సంక్రమించే లక్షణాలను , క్యాన్సర్లను బచ్చలి నిరోధిస్తుంది.
బచ్చలి ఆకుల్లో ఉండే క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ క్యాన్సర్ వ్యాధికి మూల కారణమైన మూల పదార్ధాలను తొలగించడంలో తోడ్పడుతుంది.
బచ్చలి ఆకుల్లో ఉండే యాంటీ ఆసిడ్స్ కణాలను విచ్చిన్నం చేయడంలో, రక్త నాళాల్లో వాపును నివారించి గుండెకు రక్షణ కల్పిస్తుంది. రక్త ప్రసరణ సులభం చేసే నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేసి రక్తపోటును నివారిస్తుంది.
బచ్చలి ఆకుల్లో ఉండే పోలిఫెనాల్స్ ధమనులలో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించి కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి ఆకుల్లో ఉండే పోషకపదార్ధాలు వ్యాధికారక బాక్టీరియా, వైరస్, విషపూరిత రసాయినాలుచ మెర్క్యూరీ, సీసం వంటి లోహాల వల్ల శరీరం రోగమయం కాకుండా కాపాడుతుంది.
బచ్చలి ఆకుల్లో ఉండే ఫైటోయిస్డి స్టెరాయిడ్స్ శరీరంలో గ్లూకోజ్ జీవ క్రియను పెంచి బ్లడ్ షుగర్ తగ్గించడంలో సాయం చేస్తుంది.
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి