కర్పూరంతో చలికాలంలోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూడండి

By Hari Prasad S
Dec 04, 2024

Hindustan Times
Telugu

కర్పూరంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల దురదతో చికాకు పెట్టే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

కర్పూరంలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల బ్యాక్టీరియాతో వచ్చే మొటిమలు రాకుండా చేస్తుంది. ముఖం జిడ్డుగా కాకుండా చేస్తుంది

చర్మంపై అయిన చిన్న గాయాలు, గాట్లను కర్పూరం సులువుగా మాన్పించగలదు

వివిధ కారణాల వల్ల చర్మంపై కలిగే దురదను కర్పూరం అడ్డుకోగలదు

కర్పూరాన్ని శరీరానికి రాసుకున్నప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది

కర్పూరంలోని చల్లదనం అందించే గుణం పొడిబారిన చర్మాన్ని మళ్లీ తాజాగా కనిపించేలా చేస్తుంది

చలికాలంలో కర్పూరాన్ని ప్రతి రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు

pixabay

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels