Sun Transit: ఒక్క పది రోజులు ఆగారంటే మీ పంట పండినట్టే.. సూర్యుడు ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు!
Sun Transit: గ్రహాల అధిపతి సూర్యుడు మరో పది రోజుల్లో తన రాశిని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్య గ్రహం డిసెంబరు 15న ధనుస్సు రాశిలోకి తన ప్రయాణాన్ని మార్చుకోనున్నాడు. ధనస్సు రాశిలోకి సూర్యడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహఆల అధిపతిగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెల ఒకసారి తన రాశి చక్రాన్ని మారుస్తాడు. మరో పది రోజుల్లో సూర్యగ్రహం తన రాశిని మార్చుకోనుంది. ఈ మార్పు కొన్ని రాశుల వారిపై విపరీత ప్రభావాన్ని చూపుతుంది. డిసెంబర్ మాసంలో బృహస్పతి రాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు డిసెంబర్ 15న వృశ్చికం నుంచి ధనుస్సు రాశిలోకి తన ప్రయాణాన్ని మార్చనున్నాడు. బృహస్పతి రాశి అయిన ధనుస్సు రాశిలో సూర్యుడు సంచారం కొన్ని రాశులకు అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి సూర్యుడి సంచారంలో మార్పు బాగా కలిసిరానుంది. పది రోజుల్లో వీళ్ల జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ రాశులేవో తెలుసుకుందాం.
ద్రుక్ పంచాంగం ప్రకారం, సూర్యభగవానుడు డిసెంబర్ 15 న వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం ఆదివారం రాత్రి 10:19 గంటలకు జరుగుతుంది. ఈ రోజు నుంచి తిరిగి 2025 జనవరి 13 వరకు సూర్యుడు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత జనవరి 14న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.
ధనస్సు రాశిలోకి సూర్యుడి సంచారం ఏయే రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది?
తులా రాశి:
సూర్యుని ధనుస్సు రాశి సంచారం వల్ల తులా రాశి వారు అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటారు. అదృష్టం అన్నింటా మీకు అనుకూలంగా ఉంటుంది. పని మీద దృష్టి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లొ చాలా ఉత్పాదకంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వం నుంచి రావల్సిన ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారంగా పనులు సాగుతాయి.
కర్కాటక రాశి:
ధనుస్సు రాశిలో సూర్యుడి సంచారం కర్కాటక రాశి వారికి బాగా మేలు చేస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరమైన సహాకారాలు కూడా అందుకుంటారు. ఈ సమయం మీకు అన్నింటా శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. నిధుల సమీకరణ సులభమవుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాల పరిస్థితి బాగుంటుంది. ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది.
సింహ రాశి:
సూర్యుని రాశిచక్రంలో మార్పు సింహ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్య భగవానుడి సంచారంతో ఆయన అనుగ్రహం ఈ సమయంలో పనుల్లో కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో రొమాన్స్ కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు, ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలోనూ మీదూ పై చేయి అవుతుంది. మీపై మీకు మరింత నమ్మకం కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.