ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..-icc test rankings bumrah on top yashasvi jaiswal virat kohli rishabh pant test ranks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Icc Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Published Dec 04, 2024 02:25 PM IST Hari Prasad S
Published Dec 04, 2024 02:25 PM IST

  • ICC Test Rankings: ఐసీసీ బుధవారం (డిసెంబర్ 4) టెస్టు ర్యాంకులను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా టాప్ లోనే ఉండగా.. యశస్వి రెండు స్థానాలు దిగజారినా టాప్ 5లోనే ఉన్నాడు. కోహ్లి, పంత్ ర్యాంకులు ఎలా ఉన్నాయో చూడండి.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారాడు. పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత రెండో స్థానానికి చేరిన అతడు.. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. జో రూట్ తొలి స్థానంలో, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నారు.

(1 / 5)

ICC Test Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఒక స్థానం దిగజారి 14వ స్థానానికి పడిపోయాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలోనే ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 18, రోహిత్ శర్మ 26వ స్థానాల్లో ఉన్నారు.

(2 / 5)

ICC Test Rankings: టెస్టు బౌలర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో మార్కో యాన్సెన్ దూసుకెళ్లాడు. బౌలర్ల జాబితాలో 19 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకులో.. ఆల్ రౌండర్ల జాబితాలో పదిస్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరడం విశేషం.

(3 / 5)

(AP)

ICC Test Rankings: టెస్టుల్లో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలిస్థానంలోనే కొనసాగుతున్నాడు. రబాడ, హేజిల్‌వుడ్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నారు. 

(4 / 5)

ICC Test Rankings: ఆల్ రౌండర్ అశ్విన్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు