తెలుగు న్యూస్ / ఫోటో /
BayOfBengal Depression: శుక్రవారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి మళ్లీ వానగండం
- BayOfBengal Depression: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. శుక్రవారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 6,7 తేదీల్లో ఏర్పడే అల్పపీడనం దక్షిణ దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. శుక్రవారం నాటికి అల్పపీడనం గమనం, ప్రభావంపై స్పష్టత రానుంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు కోలుకోక ముందే బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
(2 / 6)
ఫెంగల్ తుఫాను భయంతో ఏపీలో రైతులు పంటల్ని అందినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. భారీ వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను రికార్డు సమయంలో పూర్తి చేశారు.
(3 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అధికారులు తెలిపారు.
(5 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడిన తర్వాత శ్రీలంక పయనిస్తుందని భావిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంపై శుక్రవారం నాటికి స్పష్టత రానుంది.
ఇతర గ్యాలరీలు