New Telugu Movies on OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి బ్లాక్‌బాస్టర్.. మరొకటి మాత్రం?-new ott releases this week in telugu 2024 matka in prime video amaran in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New Telugu Movies On Ott: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి బ్లాక్‌బాస్టర్.. మరొకటి మాత్రం?

New Telugu Movies on OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి బ్లాక్‌బాస్టర్.. మరొకటి మాత్రం?

Galeti Rajendra HT Telugu
Dec 04, 2024 02:10 PM IST

Telugu Movies on OTT: గత వారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీలో ఆధిపత్యం చెలాయించగా.. ఈ వారం కూడా రెండు మూవీస్ సిద్ధం అయిపోయాయి. ఇందులో ఒకటి రూ.300 కోట్లకిపైగా వసూళ్లు రాబట్టిన సినిమా.

ఓటీటీలోకి తెలుగు సినిమాలు
ఓటీటీలోకి తెలుగు సినిమాలు

ఓటీటీలో మరికొన్ని గంటల్లోనే రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కి రాబోతున్నాయి. ఇందులో ఒకటి బ్లాక్‌బాస్టర్ మూవీకాగా.. మరొకటి బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా బోల్తా కొట్టిన డిజాస్టర్ మూవీ. గురువారం (డిసెంబరు 5) ‘పుష్ప 2: ది రూల్’ మూవీ థియేటర్లలోకి రాబోతుండగా.. అదే సమయంలో ఓటీటీలో సందడి చేసేందుకు ఈ తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి.

ఓటీటీలోకి అమరన్ మూవీ

తమిళ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రూ.300 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. బుధవారం (డిసెంబరు 4) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కి రాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

వరుణ్‌తేజ్ మట్కా ఓటీటీలోకి

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మట్కా మూవీ.. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీకి రాబోతోంది. నవంబరు 11న భారీ అంచనాల నడుమ విడుదలైన మట్కా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో రోజుల వ్యవధిలోనే థియేటర్లలో మాయమైన ఈ సినిమా.. మూడు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మట్కా మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. బుధవారం (డిసెంబరు 4) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కి రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.

గత వారం రెండు హిట్ మూవీలు

గత గురువారం నుంచి ఓటీటీలో లక్కీ భాస్కర్, క సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. కిరణ్ అబ్బవరం హిట్ మూవీ ‘క’ ఈటీవీ విన్‌లో సందడి చేస్తోంది. అయితే.. లక్కీ భాస్కర్ ఐదు భాషల్లో అందుబాటులో ఉన్నా.. క మాత్రం కేవలం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‌కి ఉంచారు.

Whats_app_banner