Matka OTT Release Date: ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న మట్కా.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు-matka ott release date varun tej movie ott streaming on amazon prime video matka box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Matka Ott Release Date: ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న మట్కా.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు

Matka OTT Release Date: ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న మట్కా.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు

Hari Prasad S HT Telugu
Nov 18, 2024 10:32 AM IST

Matka OTT Release Date: మట్కా మూవీ ఓటీటీలోకి అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చేస్తోందా? తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న మట్కా.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న మట్కా.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Matka OTT Release Date: వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ ఈ మధ్య థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. ఈ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో వరుణ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా అనుకున్నదాని కంటే ముందే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

మట్కా ఓటీటీ రిలీజ్ డేట్

వరుణ్ తేజ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మట్కా. గత శుక్రవారం (నవంబర్ 14) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీనికి పెద్దగా పాజిటివ్ రివ్యూలేమీ రాలేదు. దీంతో అనుకున్నదాని కంటే ముందే మట్కా ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ రెండో వారంలోనే అంటే నెల రోజుల్లోపే ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలాంటి వాళ్లు కూడా నటించిన ఈ మట్కాలో వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు దక్కినా.. ఊహించగలిగేలా ఉండే స్టోరీ లైన్ తో సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మట్కా మూవీ స్టోరీ ఏంటంటే?

వాసు అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. ఈ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. పలాస 1978 మూవీతో మంచి పేరు సంపాదించిన దర్శకుడితడు. గ్యాంబ్లర్ రతన్ ఖెత్రి జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు. 1958 నుంచి 1982 మధ్య విశాఖపట్నం నేపథ్యంలో సాగే కథ ఇది.

మ‌ట్కా ఆట నేప‌థ్యంలో దాదాపు మూడు టైమ్‌పీరియ‌డ్స్‌లో ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సాధార‌ణ యువ‌కుడు మ‌ట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడ‌నే జ‌ర్నీలో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ లేక‌పోవ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

బ‌ర్మా నుంచి శ‌ర‌ణార్థిగా వైజాగ్‌కు వ‌ల‌స‌వ‌స్తాడు వాసు (వ‌రుణ్ తేజ్‌). అనుకోని ప‌రిస్థితుల్లో హ‌త్య కేసులో చిక్కుకొని జైలుపాల‌వుతాడు. జైలు నుంచి విడుద‌లైన వాసు పూర్ణ మార్కెట్‌లో కొబ్బ‌రికాయ‌ల వ్యాపారి అప్ప‌ల‌రెడ్డి (అజ‌య్ ఘోష్‌) ద‌గ్గ‌ర ప‌నిలో చేరుతాడు.

మార్కెట్‌లో జ‌రిగిన గొడ‌వ‌లో రెడ్డి గ్యాంగ్‌ను ఎదురిస్తాడు వాసు. అత‌డి ధైర్యం న‌చ్చిన నానిబాబు (కిషోర్‌) త‌న గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు. ఆ రౌడీ గ్యాంగ్‌తో మొద‌లైన అత‌డి జ‌ర్నీ మ‌ట్కా కింగ్ వ‌ర‌కు ఎలా సాగింది? వాసును చంపాల‌ని ప్ర‌భుత్వం ఎందుకు అనుకుంది. వాసుకు సాహుకు ఉన్న సంబంధం ఏమిటి? వాసు జీవితంలోకి వ‌చ్చిన మీనాక్షి (మీనాక్షి చౌద‌రి) సోఫియా (నోరా ఫ‌తేహి) ఎవ‌ర‌న్న‌దే మ‌ట్కా మూవీ క‌థ‌.

నవంబర్ 14న సూర్య కంగువ మూవీతోపాటు థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ రెండు సినిమాలకీ డిజాస్టర్ టాకే వచ్చింది. అటు కంగువ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మట్కా హక్కులు ప్రైమ్ వీడియోకి దక్కాయి. డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో మట్కా మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

మట్కా బాక్సాఫీస్

తొలి షో నుంచే మట్కాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపైనా పడింది. ఫస్ట్ వీకెండ్ దారుణంగా ఉంది. ఆదివారం కూడా ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. దీంతో రూ.35 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మట్కా.. నాలుగు రోజుల్లో కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

దీంతో మేకర్స్ కు భారీ నష్టం తప్పేలా లేదు. మూవీ రిలీజ్ కు ముందు రూ.20 కోట్ల వరకూ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ లెక్కన లాభాల్లోకి రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

Whats_app_banner