Meenakshi Chaudhary Marriage: హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి పెళ్లి చర్చ తెరపైకి రావడానికి అసలు కారణమిదే!
Sushanth Marriage: సుశాంత్, మీనాక్షి చౌదరి మూడేళ్ల క్రితం ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ కలిసి ఏ సినిమాకి పని చేయలేదు. కానీ.. రెండు రోజుల క్రితం సడన్‌గా ఇద్దరికీ పెళ్లి అంటూ వార్త వెలుగులోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే?
హీరోయిన్ మీనాక్షి చౌదరిని హీరో సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి.. వరుణ్ తేజ్ సరసన మాట్కా సినిమాలోనూ నటించింది. కానీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాంతో హిట్ ఆనందం ఈ అమ్మడికి ఎక్కువ రోజులు లేకుండా పోయింది.
సుశాంత్ సినిమాతోనే ఎంట్రీ
వాస్తవానికి మీనాక్షి చౌదరి.. సుశాంత్ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత మీనాక్షి చౌదరి పలు సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి కాలం కలిసిరాలేదు. అయితే.. దీపావళి రోజున విడుదలైన లక్కీ భాస్కర్ మూవీలో మధ్యతరగతి హౌస్ వైఫ్‌గా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి.
మూడేళ్లుగా టచ్‌లోనే
ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సుశాంత్, మీనాక్షి చౌదరి రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారట. ఈ క్రమంలో ఇటీవల ఈ ఇద్దరూ కలిసిన విషయం బయటికిరాగానే పెళ్లి వార్త గుప్పుమంది. అయితే.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని సుశాంత్ సన్నిహితులు చెప్తున్నారు. మీనాక్షి చౌదరి కూడా ఇలానే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మీనాక్షి నెక్ట్స్ మూవీ ఇదే
మీనాక్షి చౌదరి నెక్ట్స్ మూవీ సీనియర్ హీరో వెంకటేశ్‌తో చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’’కాగా.. ఈ మూవీలో మీనాక్షి హాట్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.