OTT Action Drama: నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. పోతుగడ్డ స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Action Drama: ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో ఒరిజినల్ తెలుగు యాక్షన్ డ్రామా వచ్చేస్తోంది. ఈ సినిమా పేరు పోతుగడ్డ. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని సదరు ఓటీటీ అనౌన్స్ చేసింది.
OTT Action Drama: ఓటీటీలోకి మరో తెలుగు మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పేరు పోతుగడ్డ. లవ్ స్టోరీకి పొలిటికల్ గేమ్ ను జోడించి ఓ యాక్షన్ డ్రామా ఈ మూవీని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. తమ ఒరిజినల్ మూవీస్ విషయంలో మెల్లగా దూకుడు పెంచుతున్న ఈటీవీ విన్.. ఆ క్రమంలోనే ఈ పోతుగడ్డను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
పోతుగడ్డ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీల్లో థియేటర్లలో రిలీజైన సినిమాలే కాదు తాము సొంతం నిర్మించిన ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ కూడా వస్తుంటాయి కదా. ఇందులో భాగంగా ఈటీవీ విన్ మరో ఒరిజినల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే నవంబర్ 8వ తేదీని లీలా వినోదం అనే మూవీని తీసుకొస్తున్నట్లు గతంలోనే ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇందులో యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ నటించాడు.
ఇక తాజాగా పోతుగడ్డ అనే మరో ఒరిజినల్ మూవీ రాబోతోంది. ఈ సినిమాను నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ఒక ప్రేమ కథ, ఒక రాజకీయ ఆట, సస్పెన్స్ తో నిండిన యుద్ధం పోతుగడ్డ. ఓ విన్ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. ఈటీవీ విన్ లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది.
ఇంట్రెస్టింగా పోస్టర్
పోతుగడ్డ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఓవైపు డబ్బు, మరోవైపు ఓ గన్ను, ఇంకోవైపు ఓ పువ్వు.. మధ్యలో రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు.. ఇలా ఇంట్రెస్టింగా ఈ పోస్టర్ ను రూపొందించారు. పోతుగడ్డ మూవీకి ఎ టేల్ ఆఫ్ లవ్ (ప్రేమ కథ) అనే ట్యాగ్ లైన్ కూడా ఉంచారు. ప్రేమ కథ, రాజకీయ ఆట అంటూ ఈటీవీ విన్ ఈ మూవీ స్టోరీ గురించి రెండు ముక్కల్లో చెప్పేసింది.
ఈ పోతుగడ్డ మూవీని రక్ష వీరన్ డైరెక్ట్ చేశాడు. అయితే చాలా వరకు ఈ సినిమాలో కొత్త వాళ్లే లీడ్ రోల్స్ చేశారు. శత్రు, ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు నటించారు. నవంబర్ 14న మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుండగా.. రానున్న రోజుల్లో ట్రైలర్ రిలీజ్ తోపాటు మరికొన్ని ఈవెంట్స్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుపమ చంద్ర, శరత్ చంద్ర మూవీని ప్రొడ్యూస్ చేశారు.
శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. ఈ పోతుగడ్డ మూవీ ఆసక్తి రేపుతోంది. ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను చాలా తక్కువ మొత్తానికే సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తుండటంతో ఈ పోతుగడ్డ మూవీని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓటీటీని నెలకు రూ.99తో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.