Action Thriller Web Series: యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్-action thriller web series citadel honey bunny trailer samantha ruth prabhu nailed action sequences prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Web Series: యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్

Action Thriller Web Series: యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu

Action Thriller Web Series: సమంత నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ మరో ట్రైలర్ రిలీజైంది. పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయిన ఈ ట్రైలర్లో సమంత కొన్ని యాక్షన్ సీన్లలో తన స్టంట్స్ తో అదరగొట్టేసింది.

యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సమంత.. థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో ట్రైలర్ రిలీజ్

Action Thriller Web Series: ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ పేరు సిటడెల్ హనీ బన్నీ. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ సిరీస్ ఇది. సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కు రానుండగా.. తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.

సిటడెల్ హనీ బన్నీ ట్రైలర్

సిటడెల్.. ఇదొక స్పై యూనివర్స్. గతంలో ఇంగ్లిష్ లో వచ్చిన తొలి సీజన్ లో ప్రియాంకా చోప్రా.. నాదియా సింగ్ అనే ఓ స్పైగా నటించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ హిందీలో రాబోతోంది. ఇందులో ఆ నాదియా సింగ్ పేరెంట్స్ పాత్రల్లో సమంత, వరుణ్ ధావన్ నటించారు.

అసలు వాళ్లు ఏజెంట్లుగా ఎలా మారారు? ఆ ఇద్దరూ గూఢాచారులుగా చేసిన ఆపరేషన్స్ ఏంటి అన్నది సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ కనిపించారు. తాజాగా ఈ సిరీస్ రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది మరింత యాక్షన్ తో ఈ జానర్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా సమంతను హైలైట్ చేస్తూ ఈ కొత్త ట్రైలర్ సాగడం విశేషం.

సిటడెట్ హనీ బన్నీ ట్రైలర్ ఎలా ఉందంటే?

తాము చేస్తున్నది తప్పని తెలిసినా.. చేయక తప్పదంటూ బన్నీ పాత్ర పోషించిన వరుణ్ ధావన్ ఎంట్రీతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత తన కూతురిని కాపాడుకోవడానికి ప్రయత్నించే సమంత పాత్ర వస్తుంది. ఓ నటి కావాల్సిన వ్యక్తి.. స్పైగా ఎలా మారిందన్నది కూడా ఈ ట్రైలర్ లో చూపించారు.

నటి కావడానికి ఆడిషన్స్ కూడా ఇచ్చిన హనీ.. తర్వాత బన్నీని కలిసిన తర్వాత ఎందుకు, ఎలా ఏజెంట్ గా మారిందో తన కూతురికి ఆమె చెప్పడం ఇందులో చూడొచ్చు. చాలా వరకు సమంత చుట్టే ఈ ట్రైలర్ తిరిగింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ లో తన స్టంట్స్ తో సామ్ అదరగొట్టింది. ఇంతకుముందు ఇదే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి వాళ్లతో చేతులు కలిపింది.

యాక్షన్ లవర్స్ కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తారని ట్రైలర్ చూస్తూనే స్పష్టమవుతోంది. చాలా రోజుల తర్వాత సమంత ఈ సిరీస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మయోసైటిస్ లాంటి వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత ఇలాంటి యాక్షన్ ప్రధాన పాత్రలో ఆమె నటించడం నిజంగా విశేషమే. దీంతో ఈ రాబోయే వెబ్ సిరీస్ లో సామ్ ప్రధాన ఆకర్షణ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.