Prabhas Samantha: సమంతతో నటించనన్న ప్రభాస్.. కారణం ఆ ఒక్క సమస్య.. ఆ మూవీతో కాస్తలో మిస్సయిన జోడీ!
Prabhas Samantha Never Worked Together Reasons: ప్రభాస్, సమంత కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సమంతతో కలిసి నటించని అని ఓ సందర్భంలో ప్రభాస్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. సామ్‌తో ప్రభాస్ నటించకపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు డార్లింగ్.
Prabhas Samantha Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫోలోయిం గ్ తెలిసిందే. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ విషయం ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది. అదే ప్రభాస్, సమంతల జోడి. సమంత, ప్రభాస్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి గల కారణాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సమంతతో మాత్రం
పాన్ ఇండియా స్టార్, అమ్మాయిల డార్లింగ్ ప్రభాస్ ఎంతోమంది టాప్ హీరోయిన్స్‌తో కలిసి నటించాడు. అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, శ్రియా శరణ్, శ్రుతి హాసన్ వంటి సౌత్ హీరోయిన్స్‌తోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని రొమాన్స్ పండించాడు. కానీ, సౌత్‌లో సెన్సేషనల్ హీరోయిన్ అయిన సమంతతోమాత్రం ప్రభాస్ ఇప్పటివరకు కలిసి యాక్ట్ చేయలేదు.
ప్రభాస్-సమంత హైట్ గ్యాప్
సమంతతో ప్రభాస్ కలిసి నటించకపోవడానికి గల కారణాలు డార్లింగ్ 45వ బర్త్ డే సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రముఖ వెబ్ సైట్స్ ప్రకారం సమంతతో ప్రభాస్ నటించకపోవడానికి గల కారణం హైట్ అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎత్తు దాదాపుగా ఆరు అడుగులు 2 అంగుళాలు (186 CM) ఉంటుంది. అలాగే, సమంత హైట్ 5.2 (158 CM) కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
అదొక్కటే సమస్య
ఇద్దరి మధ్య హైట్ చాలా గ్యాప్ ఉండటం ప్రభాస్, సమంత జోడీ అంతగా బాగా కనిపించదని, హై హీల్స్ మ్యానేజ్ చేయడానికి కూడా వీళ్లేని పరిస్థితి అని తెలుస్తోంది. అందుకే హైట్ అనే ఒక్క సమస్య కారణంగానే సమంతతో కలిసి నటించట్లేదని, నటించనని గతంలో ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పినట్లు ప్రముఖ వెబ్ సైట్స్ వెల్లడించాయి.
సుజీత్ దర్శకత్వంలో
అయితే, ఒకసారి ప్రభాస్, సమంత జోడి కట్టే అవకాశం వచ్చినట్లు గతంలో టాక్ నడిచింది. ఆ సినిమానే సాహో. యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓజీ తెరకెక్కిస్తున్న సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో మూవీకి ముందుగా హీరోయిన్‌గా సమంతను అనుకున్నారట. కానీ, సాహోను తెలుగు, హిందీ బైలింగువల్ మూవీతోపాటు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు.
హైట్ గ్యాప్ సమస్య కాదంటూ
బాలీవుడ్‌లో కూడా మంచి రెస్పాన్స్ కోసం హిందీ భామ శ్రద్ధా కపూర్‌ను సాహో మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. అయితే, గతంలో సాహో మూవీలో హీరోయిన్‌గా సమంత నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఫ్యాన్స్‌కు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందిలేకుంటే ప్రభాస్, సమంత మధ్య ఉన్న హైట్ గ్యాప్ పెద్ద సమస్య కాదని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కనీసం అలా అయినా
మరి ఇవేవి పట్టించుకోకుండా భవిష్యత్తులో ప్రభాస్, సమంత హీరోహీరోయన్స్‌గా నటిస్తారా.. లేదా కనీసం ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ అయిన చేసుకుంటారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2 సినిమాలతో బిజీగా ఉంటే.. సమంత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.