Samantha Remuneration : వామ్మో 'సిటడెల్' కోసం సమంత ఇన్ని కోట్లు తీసుకుంటుందా?-samantha ruth prabhu remuneration hiked to 10 crore for citadel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Remuneration : వామ్మో 'సిటడెల్' కోసం సమంత ఇన్ని కోట్లు తీసుకుంటుందా?

Samantha Remuneration : వామ్మో 'సిటడెల్' కోసం సమంత ఇన్ని కోట్లు తీసుకుంటుందా?

Anand Sai HT Telugu
Jun 13, 2023 09:37 AM IST

Samatha Remuneration : నటి సమంత వెబ్ సిరీస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే సిటడెల్ వెబ్ సిరీస్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

సమంత
సమంత

సౌత్ స్టార్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం సిటడెల్(Citadel) సిరీస్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా, ఇద్దరు స్టార్స్ పాల్గొంటున్నారు. ఇండియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇప్పుడు విదేశాలకు వెళ్లింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిటడెల్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. సిటడెల్ అనేది ఇంగ్లీష్ వెర్షన్ వెబ్ సిరీస్. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా(Priyanka Chopra), రిచర్డ్ మాడెన్‌ నటించారు. ఈ పాత్రల ఇండియన్ వెర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ కనిపించనున్నారు.

ప్రస్తుతం సమంత(Samantha)పై మరో వార్త వినిపిస్తోంది. సిటడెల్ సిరీస్ కోసం సమంత భారీగానే రెమ్యునరేషన్ పెంచిందని అంటున్నారు. 4 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమంత.. సిటడెల్ కోసం ఏకంగా 10 కోట్లు అందుకుంటుందట. దీని ద్వారా బాలీవుడ్ స్టార్ నటీమణులు తీసుకునే రెమ్యునరేషన్ తో సమానంగా సమంత నిలుస్తోంది. అలియా భట్(Alia Bhatt), దీపికా, కంగనా వంటి బాలీవుడ్ తారలు 8 నుంచి 10 కోట్ల రూపాయలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పుడు సమంత కూడా అంతే రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

సమంత ఇంతకుముందు రాజ్ మరియు డికెతో కలిసి పనిచేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించింది. ఇది భారీ విజయం సాధించింది. ఆమె నటించిన మెుదటి వెబ్ సిరీస్ భారీగా హిట్ కావడంతో సిటడెల్ పారితోషికం పెంచినట్లు సమాచారం. వెబ్ సిరీస్, ఖుషి సినిమాలతో బిజీగా ఉంది సమంత. ఇటీవల సమంత ఖుషీ షూటింగ్ కోసం టర్కీ వెళ్లింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. వీరిద్దరూ టర్కీలో ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

సమంత ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ చేస్తోంది. ఇటీవల సమంత, వరుణ్(Samantha-Varun) సెర్బియాలోని ఒక క్లబ్‌లో కనిపించారు. 'హు అంటావా మావా ఊహూ అంటావా' అనే సూపర్ హిట్ పాటకు డ్యాన్స్ చేశారు. సెర్బియాలో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

IPL_Entry_Point