Video: సెర్బియా క్లబ్లో 'ఊ అంటావా’ పాట.. చిందేసిన సమంత
Samantha Dance: ఊ అంటావా పాటకు సెర్బియా క్లబ్లో సమంత డ్యాన్స్ చేసింది. సిటడెల్ సిరీస్ షూటింగ్లో ఉన్న ఆమె ఓ పార్టీలో డ్యాన్స్ చేయగా.. వీడియో వైరల్ అవుతోంది.
Samantha Dance : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీ చేస్తోంది. అలాగే సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది సామ్. మొన్నటి దాకా ఖుషీ షూటింగ్ కోసం టర్కీలో ఉన్న సమంత.. ఇటీవల సెర్బియాలో సిటాడెల్ యూనిట్‌తో జాయిన్ అయింది. ఆ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ సిరీస్ షూటింగ్ సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్లో జరిగింది. అయితే తాజాగా బెల్గ్రేడ్లోని ఓ క్లబ్‌కు వెళ్లిన సమంత 'ఊ అంటావా మావా' పాటకు చిందేసింది.
సిటాడెల్ యూనిట్ బెల్గ్రేడ్లోని ఓ క్లబ్లో పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ పాట ప్లే అయింది. ఆ సమయంలో ఈ పాటకు డ్యాన్స్ చేసింది సమంత. అక్కడ ఉన్న వారు కూడా ఈ పాటకు జోష్‌తో చిందేశారు. డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్ చేశాడు పక్కనే ఉన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.
బెల్గ్రేడ్ క్లబ్లో సమంత డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “సెర్బియాలో ఊ అంటావా క్రేజ్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. సామ్” అంటూ ఓ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరికొందరు కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. కాగా, ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్కు ప్రీక్వెల్‌గా సమంత నటిస్తున్న సిటాడెల్ రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెర్బియా షూటింగ్ షెడ్యూల్‌ను సిటాడెల్ టీమ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాలోని “ఊ అంటావా మావా” పాట ఎంతో హిట్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ ఓ ఊపు ఉపేసింది. ముఖ్యంగా ఈ పాటలో సమంత చేసిన డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ జోష్‌గా ఉంటే.. సమంత స్పెప్పులు అదిరిపోయాయి. దీంతో ఈ పాట దేశమంతా మార్మోగిపోయింది. హిందీ వెర్షన్ కూడా సూపర్ హిట్ అయింది.
సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం మూవీ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. అయితే, కమర్షియల్‌గా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. గతేడాది మాత్రం యశోద మూవీ సమంతకు మంచి విజయాన్ని ఇచ్చింది. విజయ్ దేవరకొండ - సమంత కాంబోలో రానున్న ఖుషీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.