World Saree Day: మీ వార్డ్ రోబ్‌లో కచ్చితంగా ఉండాల్సిన కొన్ని సంప్రదాయ భారతీయ చీరలు ఇవిగో
World Saree Day: చీరతో భావోద్వేగాల అనుబంధాన్ని కలిగి ఉంటారు మహిళలు. ఇక్కడ మీ వార్డ్ రోబ్‌లో కచ్చితంగా ఉండాల్సిన చీరల జాబితాము ఇచ్చాము. ప్రపంచ శారీ దినోత్సవం సందర్భంగా అవేంటో తెలుసుకోండి.
భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా చీరను పోలినటువంటి వస్త్రధారణ ఉండదు. అందుకే చీర గొప్పదనం చెప్పేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 21 ‘వరల్డ్ శారీ డే’ నిర్వహించుకుంటారు. నిండైన ఈ వస్త్రధారణ చూడగానే గౌరవ భావనను అందిస్తుంది. మహిళలకు చీరలతో భావోద్వేగ అనుబంధం ఉంటుంది. ఎన్ని చీరలు కొన్నా మహిళలకు ఇంకా కావాలనే అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి కూడా చీరలపై ఎనలేని ఇష్టం ఉండడం సహజం. మీరు కూడా చీరల ప్రేమికులైతే మీ వార్డ్ రోబ్‌లో కచ్చితంగా ఉండాల్సిన కొన్ని సంప్రదాయ భారత చీరల జాబితాను ఇచ్చాము.
బెనారసి చీర
ఈ చీరకు అభిమానులు ఎక్కువే. ఇది వారణాసి వీధుల్లో ఉద్భవించిన అత్యంత అందమైన చీర ఇదే. గొప్ప సంక్లిష్టమైన నేతకు ప్రసిద్ధి చెందింది. వివాహాలు, పండుగ సమయాల్లో బెనారసీ చీర కడితే మీ లుక్కే మారిపోతుంది.
చందేరి చీర
మీరు తేలికపాటి చీరను కావాలనుకుంటే చందేరి చీరను ఎంపిక చేసుకోండి. ఇది తేలికగా ఉంటుంది. కానీ లుక్స్ మాత్రం అదిరిపోతాయి. సాధారణ పండుగ సమయంలో చందేరి చీర కట్టుకుంటే మీరు సులువుగా పనులు కూడా చేసుకోగలరు.
బంధానీ చీర
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బంధానీ చీరలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చీరలు ఆ రెండు రాష్ట్రాల్లోనే జన్మించాయని చెప్పుకుంటారు. బంధాన్ని చీరలు ప్రత్యేకమైన టై అండ్ డై నమూనాలను కలిగి ఉంటాయి. ప్రకాశంవంతమైన రంగుల్లో ఈ బంధానీ చీరలు వస్తాయి. ఇది సులువుగా కట్టుకోవచ్చు. తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయివి.
టాంట్ చీర
పశ్చిమ బెంగాల్లో ఎరుపు, పసుపు రంగుల్లో టాంట్ చీరలు కడుతూ ఉంటారు. ఇవి అక్కడ సంప్రదాయ బద్ధమైన చీరలు. ఇవి కేవలం కాటన్ దారాలతోనే నేస్తారు. పలుచగా ఉండే చీరలు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటాయి. ఇవి వేడి వాతావరణంలో కూడా చల్లదనాన్ని అందిస్తాయి.
టిష్యూ సిల్క్ చీర
టిష్యూ సిల్క్ చీరలు చూడగానే గ్రాండ్ గా, రాయల్ టచ్ తో కనిపిస్తాయి. మెటాలిక్ థ్రెడ్లతో ఈ చీరను నేస్తారు. వివాహాలకు పెద్దపెద్ద అధికారిక సమావేశాలకు ఈ చీర కట్టుకుంటే లుక్స్ అదిరిపోతాయి. తేలికపాటి మెరుపుతో ఇవి చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి.
పటోలా చీరలు
పటోలా చీరల్లో ముదురుగా ఉండే రెండు మూడు రంగుల ఉంటాయి. దీని డిజైన్లు ఇక్కత్ చీరను గుర్తుచేస్తాయి. ఈ చీరలు కట్టుకుంటే పండుగ కళ వచ్చేస్తుంది. దీని డిజైన్లు కూడా కాస్త భిన్నంగానే ఉంటాయి.
భాగల్ పూర్ చీరలు
భాగల్ పూర్ చీరలు బీహార్ నుంచి ఉద్భవించాయి. బీహార్ లోనే భాగల్ పూర్ నగరం ఉంది. ఇది సాంప్రదాయమైన సిల్క్ ఫ్యాబ్రిక్ చీర దీన్ని కట్టుకుంటే ఎంతో రుచిగా కనిపిస్తారు. సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.
పోచంపల్లి ఇక్కత్ చీర
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చీరలు ఇక్కత్. ఇది సాధారణంగా రెండు మూడు రంగుల జతతో వస్తాయి. కాటన్, సిల్క్ ఈ రెండు దారాలతోనూ వీటిని నేస్తారు. హుందాగా ఉండే లుక్ ను ఇవ్వడంలో ఇక్కత్ చీర ముందుంటుంది.
కాంజీవరం చీర
కాంజీవరం చీరను పట్టు దారాలతో నేస్తారు. దక్షిణ భారతదేశంలో కాంజీవరం చీరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మల్బరీ పట్టు నుండి సేకరించిన దారాలతో ఈ చీరలను నేసి అందిస్తారు. వీటి ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. చూడగానే వేడుకలా ఉంటుంది. ఈ చీర ఎన్నో అందమైన రంగుల్లో కాంజీవరం చీరలు కనిపిస్తాయి.
టాపిక్